S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే ధ్యేయం

దర్శి,జూలై 29: రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చర్యలు తీసుకున్నారని రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు.శుక్రవారం 67వ వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా వనం -మనం కార్యక్రమాన్ని దర్శి ప్రభుత్వజూనియర్ కాలేజి ఆవరణలో మొక్కలునాటే కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్బంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 13జిల్లాల్లో కోటిమొక్కలను నాటేకార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. ప్రకాశం జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే పదిలక్షల మొక్కలునాటే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. దర్శి నియోజకవర్గంలోని ఐదుమండలాల్లో లక్షా 34వేల మొక్కలను నాటేందుకు చర్యలు చేపట్టామన్నారు. వృక్షాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందన్నారు. మొక్కలను నాటడం వలన వాతావరణ సమతూల్యం సమానంగా ఉంటుందన్నారు. చెట్లులేకపోతే వాతావరణం దెబ్బతింటుందన్నారు.చెట్లు ఉంటేనే సకాలంలో వర్షాలు కురిసి సాగు,తాగునీటికి ఇబ్బందులు ఉండవన్నారు.్భభాగంలో 50శాతం చెట్లు ఉండాలన్నారు. కేవలం 26శాతం మాత్రమే ఉన్నాయన్నారు.రాష్ట్రంలోని రహదారుల వెంట మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నామన్నారు. చెట్లు సక్రమంగా లేకపోవటం వలన వాతావరణం వెడేక్కి వేడిగాలులు వీస్తున్నాయన్నారు. విద్యార్ధులు ప్రతిఒక్కరు ఒక మొక్కను నాటి ఆ మొక్కను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. 250కోట్లరూపాయలతో రహదారుల వెంట చెట్లన నాటేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాబోయే ఒకటిన్నర సంవత్సరంలో పరిశ్రమలు అన్నిదొనకొండ ప్రాంతానికి వస్తాయన్నారు. రాష్టర్రాజధాని నిర్మాణానికి సంబంధించి అమరావతిలో 33వేల ఎకరాలను రైతులు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి 148రోజుల్లో రాజధానిని నిర్మించి చూపించారన్నారు. ముఖ్యమంత్రి చేపట్టే పలు అభివృద్ది సంక్షేమ పధకాలకు ప్రజలు పూర్తిమద్దతు ఇవ్వాలన్నారు. జిల్లాశాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మొక్కలను బిడ్డలా సంరక్షించుకోవాలన్నారు. ప్రతి ఒక్క విద్యార్ధి మొక్కలునాటే కార్యక్రమ బాధ్యతను తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ వనం -మనం కార్యక్రమాన్ని రాష్ట్రప్రభుత్వం పండగలాగా చేపట్టేందుకుచర్యలు తీసుకుందన్నారు. జిల్లాలో పదిలక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ముందుగా దర్శిగ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంనుండి ప్రభుత్వజూనియర్ కాలేజి వరకు విద్యార్ధులతో ర్యాలీనిర్వహించారు. ఈర్యాలీలో మంత్రి శిద్దాతోపాటు ఎంఎల్‌సి మాగుంట, జిల్లాకలెక్టర్ సుజాతశర్మలు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్, అటవీశాఖ డిఎఫ్‌ఒలు ఖాదర్‌బాషా, జానకీరాం,డిఆర్‌డిఎ పిడి ఎంమురళీ, డ్వామా పిడి పోలప్ప, స్టెప్ సిఇఒ బి రవి, ఇరిగేషన్ ఎస్‌ఇ శారద, తెలుగురైతు రాష్ట్రఅధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, ఎంపిపి పూసల సంజీవయ్య, జడ్‌పిటిసి జి స్టీవెన్, సర్పంచ్ విసి గురవయ్య పాల్గొన్నారు.