S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 00:19

ఇచ్చోడ, జూలై 29: రోజురోజుకు పెరిగిపోతున్న బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని స్ట్ఫె సిఈవో వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఇచ్చోడలో బాల కార్మిక నిర్మూలన ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలు బడిలో ఉండాల్సిన వయసులో బాల కార్మికులుగా మారి దుకాణాల్లో వెట్టిచాకిరి చేస్తున్నారన్నారు.

07/30/2016 - 00:19

ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక, వాణిజ్య, కమ్యూనికేషన్ వ్యవసాయ, వైద్య, కంప్యూటర్, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో తాజాగా వస్తున్న మార్పులపై పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రతి విశ్వవిద్యాలయం ఏటా పిహెచ్‌డి, ఎంఫిల్ సీట్ల భర్తీకి ప్రతిఏటా నోటిఫికేషన్ ఇవ్వాలి. 2009నుంచి పిహెచ్‌డి ప్రవేశాల్లో యుజిసి కొత్తవిధానాన్ని ప్రవేశపెట్టింది. దీనితో రీసెర్చ్ స్కాలర్‌లకు ఉత్సాహం కలిగింది.

07/30/2016 - 00:18

ఉట్నూరు, జూలై 29: ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని పక్కనపెట్టి హరితహారం కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వహించిన 8మంది టెక్నికల్ అసిస్టెంట్లకు షోకాజు నోటీసులు జారీ చేయాలని ఆర్డీవో ఐలయ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం హరితహారం కార్యక్రమంపై ఈజీ ఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

07/30/2016 - 00:18

వేమనపల్లి, జూలై 29: వరుసగా కురుస్తన్న వర్షాలతో మండలంలో ఖరీఫ్ పనులు ఊపందుకొన్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుండి వర్షాలు ఆశించిన స్థాయిలో కురియడంతో వరి సాగు చేసే రైతులు మొలక నారు మళ్ళను సిధ్దం చేస్తున్నారు. కేవలం 25 రోజుల్లో మొలక నారు ఎదుగుతుంది. దీంతో త్వరగా వరినాట్లు వేసుకోవచ్చన ఉద్దేశ్యంతో చాల మంది రైతులు మొలకను తమ పొలాల్లో చల్లుతున్నారు.

07/30/2016 - 00:18

ఉట్నూరు, జూలై 29: ఏజెన్సీ ప్రాంత ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఎం.జగన్మోహన్ అధికారులను హెచ్చరించారు. శుక్రవారం పిఎమ్మార్సీ భవనంలో ఏజెన్సీ ప్రాంత ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులు, గ్రామీణ నీటిపారుదల శాఖ, పలు శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

07/30/2016 - 00:17

బాసర, జూలై 29: బాసర గోదావరి నది వద్ద శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. గోదావరి నదికి కొత్త నీరు వచ్చి చేరుతుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు తండోపతండాలుగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహింపచేశారు. గ్రామానికి చెందిన మహిళలు సైతం గంగతెప్పలను విడిచి పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలనుండి వచ్చిన భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు.

07/30/2016 - 00:17

బాసర, జూలై 29: బాసర అమ్మవారి సన్నిధిలో శుక్రవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఎండి శాంతన్ ముఖర్జి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న వీరిని ఆలయ అధికారులు, బ్యాంకు సిబ్బంది సాదర స్వాగతం పలికారు. అమ్మవారిచెంత ప్రత్యేక కుంకుమార్చన పూజలు నిర్వహింపచేశారు. ఆలయ ప్రధానార్చకుడు అమ్మవారి చిత్రపటానిచ్చి, ఆశీర్వదించారు.

07/30/2016 - 00:16

లక్ష్మణచాంద, జూలై 29: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతో ఇంటింటికి పరిశుభ్రమైన తాగునీటిని అందించనున్నట్లు రాష్ట్ర దేవాదాయ, న్యాయ, గృహనిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని వెల్మల్ బొప్పారం గ్రామంలో రూ.409.40 లక్షలతో చేపట్టనున్న 29 ఆవాస ప్రాంతాల గ్రామలకు అంతర్గత నీటి సరఫరా పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

07/30/2016 - 00:15

ఆదిలాబాద్, జూలై 29: జిల్లాలో కుండపోతగా కురిసిన భారీ వర్షాలు ఖరీఫ్ ప్రధాన పంటలకు ప్రతిబంధకంగా మారాయి. శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూరు, ఇచ్చోడ, బోథ్, బజార్‌హత్నూర్, తలమడుగు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో రహదారుల్లో రాకపోకలు స్తంభించిపోయాయి.

07/30/2016 - 00:15

ఆదిలాబాద్, జూలై 29: ఆదిలాబాద్‌లో పక్షం రోజులుగా నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ళ శారీర దారుఢ్య ఎంపిక పరీక్షల్లో మొత్తం 5338 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అయితే ఎంపికైన అభ్యర్థులకు చివరిగా రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈనెల 15వ తేదీన కానిస్టేబుళ్ళ శారీర దారుఢ్య పరీక్షలు నిర్వహించగా, వీరిలో 4221 మంది పురుష అభ్యర్థులు, 1117 మంది మహిళా అభ్యర్థులు అర్హత సాధించడం జరిగిందన్నారు.

Pages