S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బాల కార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం

ఇచ్చోడ, జూలై 29: రోజురోజుకు పెరిగిపోతున్న బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రతిఒక్కరు భాగస్వాములు కావాలని స్ట్ఫె సిఈవో వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం ఇచ్చోడలో బాల కార్మిక నిర్మూలన ర్యాలీ నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పిల్లలు బడిలో ఉండాల్సిన వయసులో బాల కార్మికులుగా మారి దుకాణాల్లో వెట్టిచాకిరి చేస్తున్నారన్నారు. బాలకార్మికుల చట్టాలు అమలులోకి వచ్చినా ఆ చట్టాలను ఉల్లంఘిస్తూ ఆయా షాపుల్లో పిల్లలను కార్మికులుగా పెట్టుకుంటున్నారని అన్నారు. అలాంటి యజమానులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. హోటళ్ళు, గ్యారేజీలతో పాటు కిరాణ షాపులలో పనిచేసే బాల కార్మికులను యజమానులు వెంటనే తొలగించి వారిని పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రధాన వీదుల గుండా పాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి బాల కార్మిక వ్యవస్తను నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.