S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 00:33

వినాయక్‌నగర్, జూలై 29: రాష్ట్రంలోని రెడ్డి కులస్తులంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని, అప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని టిడిపి జిల్లా అధ్యక్షుడు, టిటిడి సభ్యుడు అర్కల నర్సారెడ్డి పేర్కొన్నారు.

07/30/2016 - 00:31

తెలుగు రాష్ట్రాల్లో ఎస్‌సిల వర్గీకరణ చేపట్టాలన్న డిమాండ్ సముచితమైంది. హిందూ షెడ్యూల్డుకులాల్లో మొత్తం 54 ఉప-కులాలు ఉండగా వీటిల్లో మాదిగ ఉప- కులానికి చెందిన ప్రజల జనాభా అధికం. వెనుకబడిన వర్గాల్లో ఇప్పటికే ఎ, బి,సి,డి వర్గాలున్నాయ. ఇదే సూత్రా న్ని షెడ్యూల్డు కులాలకు కూడా వర్తింపజేయడం న్యాయం.
- డాక్టర్ హనుమాన్ చౌదరి, సికిందరాబాద్
కరవు భత్యం మంజూరు చేయాలి

07/30/2016 - 00:31

వరంగల్, జూలై 29: ఎంసెట్-2 లీక్‌పై విపక్షాలు భగ్గుమన్నాయి. లీక్‌కు నిరసనగా యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని హన్మకొండలో రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ రాస్తారోకో సందర్భంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో పోలీసులు ఆందోళన కారులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

07/30/2016 - 00:31

వరంగల్, జూలై 29: తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఎంసెట్-2 లీక్ పరిణామాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ వౌనం వీడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంసెట్-2 లీక్ వీరులు గతంలో కూడా లీకు వీరులేనని ఇప్పటి వరకు అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే లీకులకు అలవాటుపడ్డారన్నారు.

07/30/2016 - 00:30

మంగపేట, జూలై 29: రేపటి (ఆదివారం) నుండి గోదావరి అంత్య పుష్కరాలు మొదలుకానున్నాయి. బృహస్పతి సింహరాశి ప్రవేశకాలంనందు గత సంవత్సరం జూలై 14 నుండి పనె్నండు రోజులపాటు గోదావరి మహా పుష్కరాలు అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. పనె్నండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే గోదావరి మహా పుష్కరాలలో భాగంగా జూలై 31 నుండి ఆగష్టు 11 వరకు గోదావరి అంత్య పుష్కరాలు జరగనున్నాయి.

07/30/2016 - 00:29

వరంగల్, జూలై 29: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలను అరెస్టు చేసి వారి నుండి అరకిలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం సిపి చాంబర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

07/30/2016 - 00:29

పరకాల, జూలై 29: ఎంసెట్-2 ప్రశ్నాప్రతాల లీకేజి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. ఎంసెట్-2 పేపర్ లీక్ స్కాం పరకాల డివిజన్ నుండే ఆరోపణలు రావడం, బయటపడడంతో డివిజన్‌లో ప్రకంపనాలు సృష్టిస్తుంది. దీనిలో పలువురు విద్యార్థులు ఉన్నారన్న అంశం అసక్తి రేపింది. అంతేకాకుండా సిఐడి అధికారులు వీరిని పిలుపించుకొని పలు దఫాలుగా మాట్లాడడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

07/30/2016 - 00:27

మహదేవపూర్, జూలై 29: బీడు భూములను సస్యశ్యామలం చేయడానికే ప్రాజెక్ట్‌లు నిర్మిస్తుంటే వాటిపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేయడం తగదని రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు.

07/30/2016 - 00:27

కరీంనగర్ టౌన్, జూలై 29: ఎంసెట్ 2లో జరిగిన అక్రమాల పేర రద్దు చేసే యత్నాలు మానుకోవాలని, కుంభకోణంలో భాగస్వాములైన వారి ర్యాంకులు నిలిపేసి, చర్యలు తీసుకోవాలంటూ ఎంసెట్ 2 విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్, తెలంగాణ చౌక్‌లలో ఆందోళనకు దిగారు. కొంతమంది చేసిన తప్పులకు తమ పిల్లలను బాధ్యులుగా చేస్తూ ఎంసెట్ 2నే రద్దుచేస్తే, వారి భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందంటూ రహదారిపై బైఠాయించారు.

07/30/2016 - 00:26

కరీంనగర్, జూలై 29: ఎమ్సెట్-2 పరీక్షను రద్దు చేయవద్దంటూ మంచి ర్యాంకులు సాధించిన విద్యారులు, వారి తల్లిదండ్రులు రెండ్రోజులుగా ఆందోళనల ద్వారా చేపట్టిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎమ్సెట్-2 రద్దుకే ప్రభుత్వం మొగ్గుచూపింది. దీంతో మంచి ర్యాంకుల సాధించిన వారిలో నైరాశ్యం, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

Pages