S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 00:14

నిర్మల్ రూరల్, జూలై 29: ప్రభుత్వం అందిస్తున్న 9 గంటల నాణ్యమైన విద్యుత్తుతో రైతులకు మేలు చేకూరుతుందని రాష్ట్ర గృహా నిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.మండలంలోని ముఠాపూర్, పాక్‌పట్లలో శుక్రవారం 33/11 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్‌లను ప్రారంభించారు. 90 వేల నీటి సామర్ద్యంగల నీటి ట్యాంకుకు శంకుస్ధాపన చేసి హరితహారం మొక్కలను నాటారు.

07/30/2016 - 00:13

శీఘ్రగతిన మార్పునకు గురౌతున్న భూగోళ పరిస్థితిపై ఒక నివేదికను తయారు చేయాలని కోరుతూ, 1983లో ఐక్యరాజ్యసమితి ‘పర్యావరణంపై ప్రపం చ స్థాయి కమిటి’ని నార్వే మాజీ ప్రధానమంత్రిణి అయిన గ్రొహార్‌లెమ్ బ్రుంట్‌లాండ్ అధ్యక్షతన నియమించింది. 22 దేశాలనుంచి ప్రాతినిధ్యంగల ఈ కమిటీలో అధిక దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాలే.

07/30/2016 - 00:12

పెద్దవూర, జూలై 29: పిడుగుపాటుకు ఇద్దరు మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి పంచాయతీ పరిధిలోని డెక్కెలతండాలో శుక్రవారం జరిగింది. తండాకు చెందిన బాణావత్ జాను పొలంలో కలుపు తీయడానికి భార్య, కుమారుడితోపాటు అదే తండాకు చెందిన మరో ఇద్దరు కూలీలను కూలీకి తీసుకెళ్లాడు.

07/30/2016 - 00:11

నల్లగొండ టౌన్, జూలై 29: ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం టిఆర్‌ఎస్‌వి ఆధ్వర్యంలో ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలంటూ ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి చేతుల మీదుగా యాంటీ ర్యాగింగ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సందర్భంగా టిఆర్‌ఎస్‌వి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రం నుంచి ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలని తోటి విద్యార్ధుల పట్ల స్నేహభావంతో మెలిగి ఉండాలంటూ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్నామన్నారు.

07/30/2016 - 00:11

నల్లగొండ టౌన్, జూలై 29 : రోహిణి నక్షత్రం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని శ్రీకృష్ణ దేవాలయంలో మూలవిరాట్‌కు నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులచే పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ట్రస్మా అసోసియేషన్ అధ్యక్షులు యానాల ప్రభాకర్‌రెడ్డి, రాధికలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

07/30/2016 - 00:10

నల్లగొండ, జూలై 29: ఎంసెట్-2పేపర్ లీకేజిని నిరసిస్తు నిందితులను శిక్షించి ఎంసెట్ రద్ధు చేయకుండా విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు విద్యార్థి సంఘాలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి సీఎం కెసిఆర్, మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు.

07/30/2016 - 00:10

గందరగోళం మధ్య నిజాయతీ కూడ ప్రస్ఫుటిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన వైద్య విధాన పరీక్ష -ఎమ్‌సెట్-2-కు హాజరైన వేలమంది విద్యార్థినీ విద్యార్థులలో అత్యధికులు కష్టపడి చదివి నిజాయతీగా పరీక్షలు వ్రాశారన్నది ఇప్పుడిలా ధ్రువపడింది. ఈ పరీక్షను రద్దుచేయరాదని రాష్టవ్య్రాప్తంగా పరీక్ష వ్రాసినవారు వారి తల్లిదండ్రులు ఆందోళన చేయడం ఇందుకు ప్రత్యక్ష ప్రమాణం.

07/30/2016 - 00:10

నల్లగొండ, జూలై 29: పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్మాణ పనులు, భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఇరిగేషన్ మంత్రి టి.హరీష్‌రావు ఆదేశించారు.

07/30/2016 - 00:09

భూదాన్ పోచంపల్లి, జూలై 29 : చేనేత కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించి వారిని ఆదుకోవాలని కేంద్ర చేనేత, జౌళి శాఖామంత్రి స్మృతి ఇరానినీ ఢిల్లీలో కలసి తెలంగాణ చేనేత నాయకులు విన్నవించారు. శుక్రవారం నాయకులు ఆలిండియా హ్యాండ్‌లుమ్ బోర్డు డైరెక్టర్ ధనంజయ్య మాట్లాడుతూ కార్మికుల పరిస్థితిని స్వయంగా తెలుసుకోవాలని కోరామని పేర్కొన్నారు.

07/30/2016 - 00:09

చౌటుప్పల్, జూలై 29: మండలం మందోళ్లగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని సింగరాయిచెర్వు గ్రామానికి చెందిన మహిళ రైతు ఇట్టబోయిన సుగుణమ్మ (50) వ్యవసాయ భూమిలో పని చేస్తుండగా కిందికి వేలాడి ఉన్న విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మరణించిన సంఘటన శుక్రవారం జరిగింది.

Pages