బాసర గోదావరి వద్ద భక్తుల సందడి
Published Saturday, 30 July 2016బాసర, జూలై 29: బాసర గోదావరి నది వద్ద శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. గోదావరి నదికి కొత్త నీరు వచ్చి చేరుతుండడంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు తండోపతండాలుగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహింపచేశారు. గ్రామానికి చెందిన మహిళలు సైతం గంగతెప్పలను విడిచి పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాలనుండి వచ్చిన భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు.