S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/30/2016 - 01:43

వనస్థలిపురం, జూలై 29: ఎంసెట్-2 పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర మంత్రులు లక్ష్మారెడ్డి, కడియం శ్రీహరీ.. తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా టిఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పనామ చౌరస్తా వద్ద ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

07/30/2016 - 01:42

హైదరాబాద్, జూలై 29: తెలంగాణ జిల్లాల ప్రాచీన చరిత్రను వెలుగులోకి తీసుకు రావడంలో డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్ర్తీ చేసిన కృషి తర తరాలకు విస్మరించలేనిదని హిమాయత్‌నగర్‌లోని చంద్రంలో తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సంతాప సభలో పలువురు వక్తలు పేర్కొన్నారు.

07/30/2016 - 01:42

ఉప్పల్, జూలై 29: రామంతాపూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్‌లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి ఆందోళన చేశారు. కళాశాల ఆవరణలో బైఠాయింపు జరిపి అవినీతిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు.

07/30/2016 - 00:36

ఇందూర్, జూలై 29: రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి రక్షిత మంచినీటిని అందించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా మొదటి దశలో 121గ్రామాలకు నీటిని అందించేందుకు అవసరమైన పనులను పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా వాటర్‌గ్రిడ్ అధికారులను ఆదేశించారు.

07/30/2016 - 00:36

బాల్కొండ, జూలై 29: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి జూన్ 1నుండి శుక్రవారం నాటికి 30టిఎంసిల వరదనీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు ఎఇ మహేందర్ తెలిపారు.

07/30/2016 - 00:35

నిజామాబాద్, జూలై 29: అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అత్యధిక విస్తీర్ణంలో పసుపు పండిస్తున్న తెలంగాణ ప్రాంత రైతాంగం చిరకాల వాంఛ అయిన పసుపు బోర్డు ఏర్పాటు కల సమీప భవిష్యత్తులో సాకారమయ్యే సూచనలు కనిపించడం లేదు.

07/30/2016 - 00:35

ఇందూర్, జూలై 29: ఈ నెల 31వ తేదీన ఉదయం 10నుండి 12.30గంటల వరకు నిర్వహించే ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుళ్ల రాత పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని టిఎస్‌పిఎస్సీ సభ్యుడు టి.వివేక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ నందు ఈ రిక్రూట్‌మెంట్ నిర్వాహణపై అధికారుల సమావేశం నిర్వహించి, ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

07/30/2016 - 00:34

కంఠేశ్వర్, జూలై 29: నిర్ణీత సమయానికి విధులకు హాజరై రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ హాజరు పర్యవేక్షణ సరిగా లేదని, అందువల్ల ఉద్యోగుల హాజరు పర్యవేక్షించాలని కలెక్టర్ యోగితారాణా అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా సందర్శించి వైద్యాధికారులు, సిబ్బంది హాజరు శాతాన్ని పరీక్షించారు.

07/30/2016 - 00:34

వినాయక్‌నగర్, జూలై 29: ప్రభుత్వరంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయవద్దంటూ నగరంలోని ఎస్‌బిహెచ్ ప్రధాన కార్యలయం ఎదుట బ్యాంకు ఉద్యోగుల సంఘం ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సమ్మె చేపట్టారు.

07/30/2016 - 00:33

కంఠేశ్వర్, జూలై 29: ఎంసెట్-2ను నియంత్రించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ శుక్రవారం బిజెవైఎం ఆధ్వర్యంలో నగరంలోని బస్టాండ్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు న్యాలం రాజు మాట్లాడుతూ, ధనవంతులు ప్రభుత్వంతో కుమ్మక్కై ఎంసెట్-2 పేపర్ లీకేజీకి పాల్పడ్డారని ఆరోపించారు.

Pages