S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

భారీ వర్షాలతో ఉప్పొంగిన వాగులు

ఆదిలాబాద్, జూలై 29: జిల్లాలో కుండపోతగా కురిసిన భారీ వర్షాలు ఖరీఫ్ ప్రధాన పంటలకు ప్రతిబంధకంగా మారాయి. శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూరు, ఇచ్చోడ, బోథ్, బజార్‌హత్నూర్, తలమడుగు మండలాల్లో కురిసిన భారీ వర్షాలకు వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో రహదారుల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. జిల్లాలో శుక్రవారం 4 సెం.మీటర్ల సగటు వర్షపాతం నమోదు కాగా తాండూర్‌లో 5.5, ఆదిలాబాద్, ఇచ్చోడ, బోథ్‌లో 5 సెం.మీటర్ల వర్షాపాతం నమోదైంది. ఇప్పటి వరకు 500 మి.మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 715 మి.మీటర్ల వర్షపాతం కురియడం గమనార్హం. తలమడుగు మండలంలోని అంతరాష్ట్ర రాహదారి అయిన సుంకిడి వంతెనపై నుండి వరద నీరు పోటెత్తి ప్రవహించడంతో ఇరువైపుల మూడు గంటల పాటు రాకపోకలు స్తంభించిపోయాయి. బజార్‌హత్నూర్ మండలంలో కడెం వాగు ఉదృతంగా ప్రవహించడంతో బల్హాన్‌పూర్ మీదుగా వరద నీరు పోటెత్తడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గడ్డెన్న వాగు ప్రాజెక్టులోకి 1800 క్యూసెక్కుల వరదనీరు చేరగా 1800 క్యూసెక్కుల నీటిని ఒక గేటుద్వారా దిగువకు వదిలిపెట్టారు. గోదావరి, పెన్‌గంగా నదులకు భారీగా వరద నీరు చేరగా భారీ వర్షాల కారణంగా పత్తి, సోయాబీన్, కంది పంటలకు తీరని ప్రతికూల ప్రభావం చూపినట్లయింది. కలుపుకోత భారంతో రైతులు ఇబ్బందులకు గురవుతుండగా కడెం ప్రాజెక్టులోకి భారీగా నీరు రావడంతో ఎడమ, కుడి కాలువలకు నీరు వదలడంతో వరినాట్లు వేయడంలో రైతులు బిజీగా గడుపుతున్నారు.