S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఎంసెట్ లీకేజీపై నిరసనల వెల్లువ

నల్లగొండ, జూలై 29: ఎంసెట్-2పేపర్ లీకేజిని నిరసిస్తు నిందితులను శిక్షించి ఎంసెట్ రద్ధు చేయకుండా విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు విద్యార్థి సంఘాలు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి సీఎం కెసిఆర్, మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిల దిష్టిబొమ్మలను దహనం చేశారు. నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, దేవరకొండ, భువనగిరి, చౌటుప్పల్, చిట్యాల, నకిరేకల్, ఆలేరు, రామన్నపేట, మోత్కూర్, మిర్యాలగూడ తదితర ప్రాంతాల్లో విద్యార్థి సంఘాలు ఎంసెట్ లికేజీని నిరసిస్తు ప్రదర్శనలు, దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పిడిఎస్‌యు, టిఎన్‌ఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యుఐ విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగాయి. ఎంసెట్ పేపర్ లికేజీకి బాధ్యతగా మంత్రులు కడియం, లక్ష్మారెడ్డిలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి.
అటు ఎంసెట్-2పేపర్ లికేజీలో నిందితుడైన తిరుమలేశ్‌కు చెందిన నల్లగొండ పద్మావతి నగర్ ఇంటి ముందు శుక్రవారం యూత్ కాంగ్రెస్, టిఎన్‌ఎస్‌ఎఫ్, కుల రిజర్వేషన్ వ్యతిరేక సంఘం ఆధ్వర్యంలో ఎంసెట్ విద్యార్థులు, తల్లిదండ్రులు శుక్రవారం ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. పై కూడా నిఘా సారించినట్లుగా తెలుస్తుంది. కొంతమంది విద్యార్థుల ఎంసెట్ పేపర్ లీకేజితో కొంతమంది విద్యార్థుల ప్రమేయం ఉంటే మొత్తం ఎంసెట్ రద్ధు చేయడం తగదంటు వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంసెట్-2ను రద్ధు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించవద్ధన్నారు. ఎంతోకష్టపడి నిజాయితీగా పరీక్ష రాసి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పరీక్ష రద్ధు చేస్తే అన్యాయం చేసినట్లవుతుందని, విద్యార్థులు మానసికంగా దెబ్బతింటారని వాపోయారు. నిజమైన దోషులను గుర్తించి శిక్షించాలని లికేజితో సంబంధం లేని విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్ధని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఎసిఆర్‌ఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు పాశం అశోక్‌రెడ్డి, టిపిసిసి అధికార ప్రతినిధి పున్నా కైలాష్‌నేత, టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మందడి సైదిరెడ్డిలు మాట్లాడుతు ఎంసెట్ లికేజీ వ్యవహారంలో నిందితుడైన తిరుమలేశ్‌ను కఠినంగా శిక్షించి అతడి వెనుక ఉన్న వారి పాత్రపై విచారణ జరిపించాలన్నారు. లికేజీకి బాధ్యత వహిస్తు మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.