S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/29/2016 - 21:10

దక్షిణాదిలో ఎన్ని సినిమాలు చేసినా కెరీర్‌కి పెద్దగా బ్రేక్ రాని తాప్సీ ఇక్కడ లాభం లేదనుకుని బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ అడపా దడపా సినిమాల్లో నటించి మంచి పేరే తెచ్చుకుంది. ఇప్పుడు అక్కడ కూడా పెద్దగా అవకాశాలు రావడం లేదు. లేటెస్ట్‌గా ఈ భామ ఓ సినిమాకు ఓకే చెప్పడంతో బాలీవుడ్‌తోపాటు సౌత్ సినీ జనాలు షాక్ అవుతున్నారట! దానికి కారణం.. తాప్సీ ఓ అడల్ట్ సినిమాకు ఓకే చెప్పడమే!

07/29/2016 - 21:08

అక్కినేని నాగార్జున హీరోగా ఓం నమోవెంకటేశాయ పేరుతో ఓ భక్తిరస చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాగార్జునతో కలిసి అన్నమయ్య, శ్రీరామదాసు, శిరీడీసాయి లాంటి భక్తిరస చిత్రాలను అందించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను ఈనెల 30న విడుదల చేస్తారు.

07/29/2016 - 21:07

...................

07/29/2016 - 21:05

రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై అరుణ్ అదిత్, పూజా జవేరి జంటగా ముకుంద్ పాండే దర్శకత్వంలో బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఎల్ 7’. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను హైదరాబాద్‌లో శుక్రవారం ఉదయం విడుదల చేశారు. సినిమా లోగోను దర్శకుడు విజయ్‌కుమార్ కొండా ఆవిష్కరించగా, థియేటర్ ట్రైలర్‌ను గొట్టిముక్కల పద్మారావు, డి.ఎస్.రావు సంయుక్తంగా విడుదల చేశారు.

07/29/2016 - 21:03

జై చిరంజీవ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కొండపల్లి పర్వతాలు సమర్పణలో తన్నీరు చిరంజీవి దర్శకత్వంలో సకినాన భూలక్ష్మి నిర్మించిన చిత్రం ‘లైఫ్‌కి ప్లాట్‌ఫాం టీనేజ్’. ఉమ,రాఘవ, ప్రకాష్, శశాంక్, రాహుల్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 13న విడుదల చేయడానికి సిద్ధమైన నేపథ్యంలో దర్శకులు తన్నీరు చిరంజీవి మాట్లాడారు.

07/29/2016 - 18:53

హైదరాబాద్: సిఎం కెసిఆర్ మంత్రివర్గంలో ద్రోహులున్నారేమో గానీ, తెలంగాణ జెఎసిలో అలాంటివారు లేరని జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం శుక్రవారం అన్నారు. నగరంలో జరిగిన జెఎసి కీలక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హైకోర్టు తీర్పు వచ్చే వరకూ ఆగి ఉంటే వైస్ చాన్సలర్ల నియామకంలో ప్రభుత్వానికి మచ్చ పడి ఉండేదికాదన్నారు.

07/29/2016 - 18:47

హైదరాబాద్‌ : టీ. ఎంసెట్‌-2 లీకేజీ కేసులో ప్రకాశం జిల్లా వాసి షేక్‌ రమేశ్‌ అలియాస్‌ రహీమ్‌ను అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు సీఐడీ అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు.14 మంది విద్యార్థులకు రమేశ్‌ ప్రశ్నాపత్రం లీక్‌ చేసి, వారి నుంచి రూ.1.73 కోట్లు వసూలు చేశాడు. విద్యార్థులను పుణె తీసుకెళ్లి శిబిరం నిర్వహించాడు. వసూలు చేసిన సొమ్ములో రూ.1.2 కోట్లు దళారీకి ఇచ్చాడు.

07/29/2016 - 17:59

కర్నూలు : తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీపై దర్యాప్తు నిర్వహిస్తున్న సీఐడీ అధికారులు కర్నూలు కొత్త బస్టాండ్ సమీపంలోగల ఓ లాడ్జిలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, హైదరాబాద్‌కు తరలించినట్లు సమాచారం.

07/29/2016 - 17:56

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్-32 విమానం అదృశ్యంపై కుట్ర జరగలేదనుకుంటున్నానని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటన చేశారు. వరుసగా ఎనిమిదో రోజు కూడా గాలింపు కొనసాగుతోందని చెప్పారు. ఈ నెల 22న తమిళనాడు చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్ వెళ్తూ ఉదయం ఎనిమిదిన్నర సమయంలో అదృశ్యమైంది. విమానంలో ఆరుగురు సిబ్బందితో పాటు 23 మంది ఉన్నారు. వీరిలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది కూడా ఉన్నారు.

07/29/2016 - 17:52

విశాఖ : విశాఖలోని జిల్లా కోర్టు ఎదురుగా శుక్రవారం ఆర్టీసీ బస్సు ఢీకొని తొమ్మిది నెలల గర్భిణి మృతిచెందింది. మరో ముగ్గురు గాయపడ్డారు. బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గర్భిణి నూకరత్నం భర్తతో కలిసి జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న బస్టాప్‌ వద్ద నిల్చుని ఉండగా, 20 నంబర్‌ ఆర్టీసీ బస్సు అధిక వేగంతో వచ్చి ఢీకొంది.

Pages