S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/28/2016 - 20:58

విక్రమ్, నయనతార, నిత్యామీనన్ ముఖ్యపాత్రల్లో తమిళంలో రూపొందుతున్న ‘ఇరుమగన్’ చిత్రాన్ని ‘ఇంకొక్కడు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన తెలుగు హక్కులను దక్కించుకుంది ఎన్.కె.ఆర్ ఫిలింస్. శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణ సినిమాలతో ఆకట్టుకున్న విక్రమ్, కొంత గ్యాప్ తరువాత చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

07/28/2016 - 20:57

ఎన్టీఆర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. దీన్ని సెప్టెంబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్న ఈ సినిమా బిజినెస్ కూడా 60 కోట్లకుపైగానే జరిగిందని సమాచారం. ప్రస్తుతం ఈసినిమా శాటిలైట్ హక్కులు హాట్ కేక్‌లా అమ్ముడయ్యాయట.

07/28/2016 - 20:56

ఈమధ్య ఓ హీరో కోసం మరో పాట పాడటం సాధారణమైంది. తమిళ హీరో ధనుష్ ఇటీవలే ఓ పాట పాడిన విషయం తెలిసిందే. సాయిధరమ్‌తేజ్ హీరోగా రూపొందుతున్న తిక్క చిత్రం కోసం ధనుష్ ఓ పాట పాడాడు. ఇపుడు ఈ సినిమా కోసం మరో తమిళ హీరో కూడా గొంతు కలిపాడు. ఒకే చిత్రంలో ఇలా ఇద్దరూ తమిళ హీరోలు పాటలు పాడటం విశేషం.

07/28/2016 - 20:55

నాగశౌర్య, పారుల్, సరయు హీరో హీరోయిన్లుగా లారెన్స్ దాసరి దర్శకత్వంలో శ్రీ సత్యవిదుర మూవీస్ పతాకంపై ఎం.వి.చౌదరి, నాగరాజ్‌గౌడ్ నిర్మిస్తున్న చిత్రం ‘నీ జతలేక’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఆగస్టు 13న విడుదలవుతున్న సందర్భంగా హీరో నాగశౌర్య చెప్పిన విశేషాలు..
అచ్చమైన ప్రేమకథ

07/28/2016 - 20:53

ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా తక్కువ సినిమాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది రాశీఖన్నా. అందానికి అందం, నటనకు నటనతో ఆకట్టుకుంటున్న ఈ భామకు తెలుగులో అవకాశాలు జోరుగా వస్తున్నాయి. ఇటీవలే సుప్రీమ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రాశి తాను ఛాలెంజింగ్ పాత్రలు కూడా చేయాలని ఆశపడుతోందట. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా నటనతోనూ ప్రూవ్ చేసుకోవాలని వుందని చెబుతోంది.

07/28/2016 - 20:52

ఆది హీరోగా వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ‘చుట్టాలబ్బాయి’ ఆగస్టులో ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇందులో ముఖ్యపాత్రలో నటిస్తున్న సాయికుమార్ తన జన్మదినం సందర్భంగా మాట్లాడుతూ, ‘నేను, ఆది కలిసి నటించాలనుకుని మంచి కథ కోసం ఎదురుచూసిన సమయంలో ఈ అవకాశం వచ్చింది. మేమిద్దరం చేసిన తొలి చిత్రం ఇది.

07/28/2016 - 20:49

నూతన కథానాయకుడు నిఖిల్‌కుమార్‌ను పరిచయం చేస్తూ చెన్నాంబిక ఫిలింస్ పతాకంపై ఎ.మహదేవ్ దర్శకత్వంలో అనితా కుమారస్వామి రూపొందిస్తున్న చిత్రం ‘జాగ్వార్’. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.దేవెగౌడ మనవడైన నిఖిల్‌కుమార్‌ను తెలుగులో పరిచయం చేస్తున్నారు.

07/28/2016 - 20:48

నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిరియాల రవిందర్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చే నెల 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

07/28/2016 - 20:47

ఏదేమైనా సన్నీలియోన్ తీరే వేరు. పోర్న్‌స్టార్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె ఇప్పుడు సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమవుతోంది. గతంలో ఎవరూ చేయని ప్రయోగం ఆమెపై చేయనున్నారు. తన కథలో తానే నటించడం అనేది ఓ రికార్డ్. గతంలో ఇద్దరు, ముగ్గురు ఇలాంటి ప్రయోగాలు చేసినా, తన చుట్టూ వున్న పాత్రలు కూడా ఆ నిజమైన నటులే నటించడం ఇక్కడ సరికొత్త రికార్డు.

07/28/2016 - 20:46

తెలుగు తెరపై తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకుంది మహానటి సావిత్రి. ఆమె తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఆమె జీవిత కథతో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన తన రెండో ప్రయత్నంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తికాగా, ప్రస్తుతం హీరోయిన్ అనే్వషణలో ఉన్నాడట.

Pages