S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

డ్రంక్ అండ్ డ్రైవ్.. 388 మందికి జైలు శిక్ష

హైదరాబాద్, జూలై 27: మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి భరతం పట్టేందుకు పగలు, రాత్రి వేళల్లో నగర ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈనెల 1 నుంచి 26వరకు నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 10వేల 152 మందిపై కేసులు నమోదు కాగా వారిలో 4వేల 609 మందికి జైలుశిక్షను విధించింది. మద్యం సేవించి పట్టుబడిన వారి నుండి రూ.31లక్షల 99వేల రూపాయలను జరిమానా రూపంలో వసూలు చేశారు. పట్టుబడిన వారిలో ఒకరికి 20 రోజులు, నలుగురికి 15 రోజులు, మరో నలుగురికి 12రోజులు, 23మందికి పది, 12మందికి 8, 23మందికి 7, 14 మందికి 6, 30 మందికి 5రోజులు, 35మందికి నాలుగు రోజులు, 55మందికి మూడు రోజులు, 157 మందికి రెండు, 30 మందికి ఒక రోజు జైలు శిక్షను విధించింది ఎర్రమంజిల్ 3, 4వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు. అంతేకాకుండా 459 మందికి సోషల్ సర్వీస్ చేసి జరిమానా కట్టాలని కోర్టు సూచించింది. ఈనెలలో నగర ట్రాఫిక్‌పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్‌లో మద్యం సేవించి పట్టుబడిన వారిలో ద్విచక్ర వాహనాదారులు 1719 మంది, త్రీ వీలర్ నడిపిన వారు 193, నాలుగు చక్రల వాహనాలు నడిపిన వారు 298, ఇతరులు 55 మందితో కలుపుకొని మొత్తం 2266 మందిపై కేసులు నమోదు చేసినట్టు నగర ట్రాఫిక్ పోలీసు అధికారులు తెలిపారు.