S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఏజెన్సీలో విష జ్వరాల పంజా.. 24 గంటల్లో నలుగురు మృతి

నార్నూర్, జూలై 27: ఏజెన్సీ పల్లెల్లో విషజ్వరాలు, అతిసార వ్యాధులు విజృంభిస్తున్నాయి. మండలంలో గడిచిన 24 గంటల్లోనే నలుగురు మృత్యువాత పడిన సంఘటన అధికార వార్గల్లో అలజడి రేపుతోంది. మండలంలోని మేడిగూడ పంచాయతీ పరిధిలోని కునికాస గ్రామంలో కాంబ్లే రవికాంత్ (13) అనే బాలుడు బుధవారం అతిసార వ్యాధితో మృతి చెందాడు. మంగళవారం మేడిగూడ గ్రామంలోఒకే కుటుంబానికి చెందిన మనె్న కెవుడ బాయి (55), కుమారుడు నాగ్‌నాథ్ (27), మనువడు సందీప్ (6) అతిసార వ్యాధితో మృతి చెందారు. గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడం, మరోవైపు అంటువ్యాధుల పట్ల అవగాహనలేమి కారణంగానే విషజ్వరాలు ప్రబలుతున్నాయి. కాగా, సమాచారం తెలుసుకున్న ఆర్డీవో ఐలయ్య బుధవారం మేడిగూడ గ్రామాన్ని సందర్శించి, అక్కడి బోరుబావులు, గ్రామ పరిసరాలను పరిశీలించారు. గ్రామంలో పారిశుద్ద లోపం ఉందని గుర్తించిన ఆర్డీవో ఐలయ్య రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిప్యూటి ఎమ్మార్వోకు ఆదేశించారు. గ్రామాల్లోపారిశుద్ధ్య లోపం ఉన్నట్లయితే కార్యదర్శులతో పాటు సర్పంచ్‌లపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కాగా, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడం బాధకరమని, కుటుంబానికి రూ.20వేల తక్షణ ఆర్థిక సాయంకింద అందజేయడం జరుగుతుందన్నారు. గ్రామంలో ఇంకుడు గుంతల నిర్వహణ లోపం వల్ల అందులో మురికి నీరు నిల్వ ఉండడంతో దోమలు వృద్దిచెంది విషజ్వరాలకు కారణమవుతున్నాయని అన్నారు. దీనికి కారణమైన ఫిల్డ్ అసిస్టెంట్, కార్యదర్శి, పెంటకుప్పల యజమానులపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్డీవో వెంట స్థానిక సర్పంచ్ కొట్నాక్ బారిక్‌రావు, ఎస్‌పిహెచ్‌వో పాల్గున్‌కుమార్, ఉప సర్పంచ్ బారిక్‌రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దస్తగిరి తదితరులు ఉన్నారు.

ముధోల్‌లో భారీ వర్షం
* జలమయమైన రోడ్లు
* కూలిన ఇళ్లు..పంటపొల్లాలో చేరిన నీళ్లు
ముధోల్, జూలై 27: నియోజకవర్గ కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమైయ్యాయి. అదేవిధంగా స్థానిక కొలి గల్లీలోని నారాయణ, జలుబాయికి చేందిన ఇళ్లు భారీవర్షంకు కూలిపొయాయి. దీంతో ఇంట్లోని సామాగ్రి తడిసి పొయిందని బాధితులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న ముధోల్ సర్పంచ్ ఆనిల్ సంఘటన స్థలంలకు చేరుకుని కూలిపొయిన ఇళ్లను పరిశీలించారు. బాధితులకు ప్రభుత్వపరంగా సహయం అందే విధంగా చూస్తానని హమి ఇచ్చారు. ఉన్నత ఆధికారులతో మాట్లాడి తక్షన సహయం అందించాలని కోరారు. వివిధ వార్డుల్లోని రోడ్లు వర్షంకు చిత్తడిగా మారిపోవడంతో రాకపొకలు చేసెందుకు ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ప్రతీ రోజు వర్షం కురవడం రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రమాదభరితంగా మారినట్లు స్థానికులు వెల్లడించారు. వివిధ గ్రామాల్లో సహితం వర్షంకు రోడ్లు చిత్తడిగా మారి ప్రజలు నడవడానిక ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని గ్రామాల్లోని లోతట్టు ప్రాంతం, కాలువలు, వాగులు ప్రవహించే ప్రాంతం సమిపంలోని పంటపొల్లాల్లో భారీగా వర్షం నీళ్లు చేరి పంటలు నీటమునిగాయి. దీంతో రైతులకు నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు. అదేవిధంగా మినుములు, పెసర, కందులు, సోయా పంటలు అధిక వర్షంకు ఎర్రబడి పొతున్నాయి. గత మూడు సంవత్సరాల నుండి ఆశించిన స్థాయిలో పంటల దిగుబడి రాకపొవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే వర్షాలు కురవడంతో రైతులు తమ తమ పంటపొలాల్లో విత్తనాలు వేశారు. వేసిన విత్తనాలు మొలకేత్తడంతో రైతుల్లో ఆనందం వేల్లివిరిసింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో తాము గట్టెక్కుతామని అనుకున్న తరుణంలో ఎడతెరి లేకుండా కురుస్తున్న వర్షంతో తమ కళ్లేదుట పెరుగుతున్న పంటలు ఎర్రబడి పొతున్నాయి. కొన్ని గ్రామాల్లో పంటలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే నష్టపొవలసి వస్తుందని రైతులు అంటున్నారు.
జాతీయ రాహదారిపై భారీగా ఏర్పడ్డా గుంతలు
ఎడతెరి లేకుండా కురుస్తున్న భారీవర్షంకు నియోజకవర్గ కేంద్రంలోని భైంసా- బాసర జాతీయ రాహదారిపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. వర్షపు నీళ్లు గుంతల్లో చేరిపొవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో గుంతలను వాహనదారులు గమనించక పొవడంతో ప్రమాదాలు జరిగి కొందరు ప్రాణలు కొలిపొయారు. ప్రసుత్తం ఏర్పడ్డ గుంతలను సకాలంలో పూడ్చాలని స్థానికలు సంబంధితశాఖ ఆధికారులను కోరుతున్నారు.