S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నేడు, రేపు ప్రిన్సిపాళ్లకు సమావేశం

ఆదిలాబాద్ టౌన్, జూలై 27: ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు గురు, శుక్రవారాల్లో సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణాధికారి బి.నాగేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. 28న ఉదయం 10 గంటలకు నిర్మల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో, అదే విధంగా మధ్యాహ్నం 2గంటలకు ఆర్ ఐవో కార్యాలయంలో, 29న ఉదయం 11 గంటలకు మంచిర్యాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియేట్ ఆడ్మిషన్ల లాగిన్లగురించి చర్చించడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా స్ట్ఫా బయెడాట ప్రొఫార్మను ఆగస్టు 2, 3 తేదీలలో బోర్డు అబ్జర్వర్లకు ఇవ్వాలని అన్నారు. మోడల్‌స్కూల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ప్రభుత్వ జూనియర్ కళాశాలల వివరాలు బోర్డు అబ్జర్వర్లకు ఇవ్వాలని, అదే విధంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రొఫార్మ వివరాలు బోర్డు అబ్జర్వర్లకు రెండు సెట్‌ల జిరాక్స్ పత్రాలతో పాటు పూర్తి వివరాలు ఇవ్వాలని అన్నారు.

హాస్టల్ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
* స్థానికంగా ఉండని వార్డెన్లపై చర్యలు తప్పవు
* సమీక్ష సమావేశంలో కలెక్టర్ జగన్మోహన్
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జూలై 27: ప్రభుత్వ వసతిగృహాల్లో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉంటూ పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన బాధ్యత సహాయ సోషల్ వెల్ఫేర్ అధికారులు, వసతిగృహాల వెల్ఫేర్ అధికారులపై ఉందని, స్థానికంగా ఉండని వార్డెన్లపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జగన్మోహన్ హెచ్చరించారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఎస్సీ హస్టల్ వార్డెన్లు, సహాయ సోషల్ వెల్ఫేర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వసతి గృహాల పనితీరు, విద్య, ఆరోగ్యం, భోజన వసతి, వౌళిక సదుపాయాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ వసతి గృహాలు పరిశుభ్రంగా ఉంచితే ఎటువంటి రోగాలు దరిచేరవని అన్నారు. హరితహారం పథకం కింద రాష్టస్థ్రాయిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారని, అదేవిధంగా వసతి గృహాల్లో కూడా మొక్కలు నాటాలన్నారు. ప్రైవేట్ వసతిగృహాలైతే యజమానులను సంప్రదించి మొక్కలు నాటించాలన్నారు. వసతి గృహాల వారిగా మొక్కలు ఎన్ని నాటారు, వాటి రక్షణకు తీసుకుంటున్న ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. నెలకు రెండుసార్లు డాక్టర్లు వచ్చి పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్ తయారు చేస్తున్నామని, ఎవరైనా రాకపోతే రిపోర్టు చేయాలన్నారు. పరిశుభ్రత పాటించాలని, గజ్జి, తామరలాంటి వ్యాదులు సోకకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. విద్యార్థులు రెండుసార్లు స్నానం చేసే విదంగా చర్యలు తీసుకోవాలని, పేద ప్రజల సామాజిక స్థాయి పెంచాలన్న ఉద్దేశంతో వసతి గృహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరిశుభ్రమైన భోజనం, వాతావరణం, నాణ్యమైన చదువు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఆగస్టు 7లోపు వసతి గృహాల అడ్వాయిస్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని తీర్మాణాలు సిద్ధంగా ఉంచాలన్నారు. జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల్లో ప్రస్తుతం 5600 మంది విద్యార్థులు ఉన్నారని, 1440 ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయుటకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఖాళీల భర్తీకి అదనపు వౌలిక సదుపాయాలు కావాలంటే వెంటనే మంజూరి చేస్తామని, ప్రైవేట్ వసతి గృహాలు సరిపోకపోతే అదనంగా దగ్గరలో ఉండే గదులను తీసుకోవాలన్నారు. ప్రహారిగోడ, టాయిలెట్స్‌కి ప్రాధాన్యత ఇస్తామని, అవి లేనిచోట నిర్మించాల్సిందిగా ఈఈ మదన్‌ను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రోజు హోంవర్క్ చేయించడంతో పాటు పాఠశాలల్లో చెప్పిన పాఠాలపై ప్రాక్టీస్ చేయించాలన్నారు. సమావేశంలో సోషల్ వెల్ఫేర్ ఇంచార్జి డిడి మేఘనాథ్, ఈ ఈ మధన్, సహాయ సోషల్ వెల్ఫేర్ అధికారులు, వసతి గృహాల వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు.