S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుష్కరాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

మహబూబ్‌నగర్, జూలై 27: కృష్ణా పుష్కరాలకు సంబందించి ప్రతి విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ టికె శ్రీదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె తన క్యాంపు కార్యాలయంలో కృష్ణా పుష్కరాలపై సమీక్ష నిర్వహించారు. ఘాట్ల వారిగా ఆమె సమీక్ష నిర్వహిస్తూ ఘాట్ల నిర్మాణం మొదలుకుని అన్ని అంశాల పట్ల కూలంకుశంగా చర్చించారు.
పుష్కరాల్లో స్వచ్ఛంద సేవలు అందించేందుకు సమ్మతి తెలిపిన ఉద్యోగులు, యువజన సంఘాలు, రెడ్‌క్రాస్ సొసైటీ, కార్మిక సంస్థలు, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ స్కాట్ వివరాలను తెలుసుకోవడమే కాకుండా ఆయా ఘాట్ల వారిగా వారిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు. పుష్కరాలకు సంబందించి భక్తుల రద్దిపై వీరందరికి శిక్షణ నిర్వహించాలన్నారు. పుష్కరాల సందర్భంగా వాహనాల పార్కింగ్, వేచిండే స్థలాలను మరోకసారి విశే్లషించుకోవాలని తెలిపారు. పుష్కరాల్లో బిఎస్‌ఎన్‌ఎల్ ద్వారా మొత్తం తొమ్మిది ఘాట్లలో టవర్స్ ఏర్పాటు చేశామని ఇందుకు సంబందించిన సౌకర్యాలు కల్పించాలని బిఎస్‌ఎన్‌ఎల్ అధికారి వేణుగోపాల్ కలెక్టర్‌ను కోరారు. ఇందుకు కలెక్టర్ స్పందిస్తూ ముక్యమైన ఘాట్లలో ఉచిత వైఫై సేవలు అందించాలని అన్ని ఘాట్లలో బిఎస్‌ఎన్‌ఎల్ సేవలు అందిస్తామని తెలిపారు. అన్ని ఘాట్ల వద్ద భద్రతకు సంబందించి చర్యలు తీసుకోవాలని డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా సినియర్ అధికారులు, మేసిస్ట్రేట్ అధికారులు ఇస్తామని ఈ సందర్భంగా కలెక్టర్‌కు తెలిపారు. మత్స్యశాఖ ద్వారా ఏర్పాటు చేసిన గజ ఈతగాళ్లు బోట్ల వివరాలను ఘాట్ల వారిగా నియమిస్తూ వివరాలు ఇవ్వాలని జిల్లా అగ్నిమాపక అధికారి భద్రత నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ముఖ్యమైన ఘాట్ల వద్ద 104,108 సేవలు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగరాంను ఆదేశించారు. కృష్ణా పుష్కరాలపై ప్రత్యేకంగా రూపొందిస్తున్న బుక్‌లేట్, బ్రోచర్లను తక్షణమే పూర్తి చేయాలని సెట్మా సిఇఓ హనుమంతరావును ఆదేశించారు. పూజ సామాగ్రి, లడ్డు ప్రసాద కౌంటర్ల ఏర్పాటు పురోహితుల నియమాకం వంటి వాటిని ముందే రూపొందించి జాబితా సమర్పించాలని అన్నారు. ముఖ్యమైన ఘాట్ల వద్ద ఎ టి ఎం కేంద్రాలను ఏర్పాటు చేయాలని బ్యాంక్ అధికారులను ఆదేశించారు. అన్ని ఘాట్ల వద్ద కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని భక్తుల రద్దీ నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆయా ఘాట్ల వారీగా విధుల నిర్వహణపై వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. పుష్కరాలలో సిసి, టివి, కెమెరాలను ఏర్పాటు చేస్తామని, భక్తులు నదిలో పాలిథిన్ కవర్లు, సబ్బులు, షాంపులు వేయరాదని, బట్టలు ఉతకరాదని కలెక్టర్ కోరారు. కృష్ణా హరతి సందర్భంగా పిండితో చేసిన దిపాలను మాత్రమే నది నీటిలో వదలాలని సూచించారు. ఈ సమావేశంలో జెఎసి రాంకిషన్, ఏజేసి బాలాజీరంజిత్ ప్రసాద్, డిఆర్‌ఓ భాస్కర్, జడ్పీ సిఇఓ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

పుష్కరఘాట్ పనులపై పిడి అసంతృప్తి
గద్వాలటౌన్, జూలై 27: కృష్ణా పుష్కరాల నేపథ్యంలో చేపడుతున్న ఘాట్ పనులపై పిడి రమణరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం నదిఅగ్రహారం దగ్గర చేపడుతున్న పుష్కరఘాట్ పనులను నాణ్యతతో పనులు చేపట్టడం లేదని అక్కడున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులను దృష్టిలో ఉంచుకొని చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణం పనులు నేటి వరకు కూడ మొదలుపెట్టక పోవడంపై అక్కడ ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపై కూడ ఆయన తీవ్రంగా మండిపడ్డారు. మరో పదిహేను రోజుల్లో పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. అయినా కాంట్రాక్టర్లు వేగంగా పనులు చేపట్టక పోవడం ఇక్కడున్న అధికారుల పనితీరు ఏమాత్రం బాగులేదని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలీస్‌వారు ప్రత్యేక చర్యలు చేపట్టాలని గద్వాల సిఐ సురేష్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో గద్వాల తహశీల్దార్ ఉదయ్‌కుమార్, ఇరిగేషన్ అధికారి పైన్తాస్‌బేగం, బషీర్, వెంకటేశ్వర్‌రెడ్డి, టౌన్ ఎస్‌ఐ నారాయణసింగ్, ఆయాశాఖల అధికారులు ఉన్నారు.