S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

తెలంగాణ వనరుల ఆధ్యయనానికి యుపి డిప్యూటీ కమిషనర్లు

కొత్తకోట, జూలై 26: తెలంగాణ రాష్ట్రంలో వనరులపై ఉత్తర ప్రదేశ్‌కు చెందిన డిఆర్‌డిఎ బాలరాం వర్మ, డిప్యూటీ కమిషనర్లు బాల్ గోపాల్ శుక్లా, బాల్‌చందర్ త్రివేది, కర్ణా పాటిల్, మిత్రా మంగళవారం వికలాంగుల పునరావాస కేంద్రంలో అద్యాయనం చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా డి ఆర్ డి ఎ పిడి బాలరాం వర్మ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా సంఘాలు ఏ విధంగా అబివృద్ధి చెందారో సభ్యులను అడిగి తెలుసుకున్నారు. డబ్బులు తీసుకోవడమే తప్పా ఏ రాష్ట్రంలో తిరిగి చెల్లించిన దాఖలాలు లేవని ఇక్కడ తీరు భిన్నంగా ఉందని డబ్బులు తిరిగి చెల్లిస్తూ మహిళా అబివృద్ధికి తోడ్పడుతున్నారని వారు తెలిపారు. అనంతరం భీమా ప్రాజెక్టు ఫెస్ 2 టన్నల్ 1ను పరిశీలించారు. సాగునీటి వనరులుకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఇక్కడ చేపడుతున్న పథకాలను తమ ఠాష్ట్రంలో అమలు పరుస్తామని వివరించారు. మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాలు తిరిగిన సంతృప్తినిచ్చిందని తెలిపారు.