S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

జూరాలకు 22వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

గద్వాల, జూలై 26: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి ఉదృతి స్థిరంగా కొనసాగుతుంది. మంగళవారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.37 మీటర్ల స్థాయిలో 9.317 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి 22వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో దిగువ శ్రీశైలం జలాశయంకు 27,615 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. అదేవిధంగా జూరాల కుడి, ఎడమ కాలువలకు సాగు నిమిత్తం 800 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 1500 క్యూసెక్కులు, సమాంతర కాలువకు వెయ్యి క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 317 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి జలాశయంలో 519.60 మీటర్ల స్థాయిలో 125.081 టిఎంసిల నీరు నిల్వ ఉండగా ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 25,420 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. అక్కడి విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం దిగువకు 25వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయంలో 491.92 మీటర్ల స్థాయిలో 31.977 టిఎంసిల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 23,992 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 14,610 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు.
మూడు యూనిట్లలో
విద్యుత్ ఉత్పత్తి
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటిని దృష్టిలో ఉంచుకొని జూరాల జలవిద్యుత్ కేంద్రం వద్ద మూడు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. మంగళవారం జూరాల ప్రాజెక్టు నుంచి 24వేల క్యూసెక్కుల వరద నీటిని వినియోగించుకొని మూడు యూనిట్లలో 117 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పతిచేసి వెల్టూర్ సబ్‌స్టేషన్‌కు అనుసందానం చేశారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీరు, జూరాల ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం చేరడంతో విద్యుత్ ఉత్పత్తికి వారం రోజుల వరకు ఎలాంటి ఆటంకాలు ఉండబోవని జెన్‌కో అధికారులు స్పష్టం చేశారు.