S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మానవాళి మనుగడకు చెట్లే ఆధారం

అడ్డాకుల, జూలై 26: మానవ మనుగడకు చెట్లే ఆధారమని జిల్లా కలెక్టర్ టి.కె శ్రీదేవి అన్నారు. మంగళవారం హరితహారంలో భాగంగా మండల పరిధిలోని కందూరు గ్రామ శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో కలెక్టర్ శ్రీదేవి మొక్కలు నాటారు. ముందుగా కలెక్టర్ శ్రీరామలింగ్వేర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 32శాతం అటవి ప్రాంతం ఉంటే పుష్కలంగా వర్షాలు కురుస్తాయని, జిల్లాలో 16 శాతం అటవి ప్రాంతం ఉందని దీంతో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఆయన కోరారు. మనిషి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలంటే మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. చెట్ల పెంపకంతో కాలుష్యా నివారణతో పాటు వర్షాధారణ పెరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు కందూరులో 40వేల మొక్కలకు గాను 15వేల మొక్కలు నాటడం అధికారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
* పోలీసుల ఆధ్వర్యంలో...
హరితహారం కార్యక్రమంలో భాగంగా అడ్డాకుల పోలీసుల ఆధ్వర్యంలో జానంపేట గ్రామంలో ఎస్ ఐ శ్రీనివాసులు మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఎస్ ఐ కోరారు. ఈ కార్యక్రమంలో డ్వామా పిడి దామోదర్ రెడ్డి, జడ్పి సి ఇ ఓ లక్ష్మి నారాయణ, ఎంపిడి ఓ నర్సింగ్ రావు, తహశీల్ధార్ రాంకోటి, ఎంపిపి బగ్గి కమలమ్మ, సర్పంచులు నాగిరెడ్డి, చెన్నమ్మ, ఎంపిటిసిలు శీరిష, విజయలక్ష్మి, నాయకులు కృష్ణయ్య, శ్రీకాంత్, ఇంద్రయ్య సాగర్, శివరాములు, సత్య నారాయణ రెడ్డి, చల్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గొందిమల్ల పుష్కరఘాట్‌ను పరిశీలించిన మంత్రులు
అలంపూర్, జూలై 26: మండల పరిధిలోని గొందిమల్ల గ్రామ సమీపంలోగల కృష్ణా పుష్కరాలకు సంబంధించి పనులను మంత్రులు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయితీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపి మంద జగన్నాథం, జాయింట్ కలెక్టర్ రాంకిషన్‌లు మంగళవారం పరిశీలించారు.పుష్కరఘాట్‌కు వచ్చే నీటిని బట్టి ఘాట్‌ను ఏర్పాటు చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.