S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 05:45

తిరుమల, జూలై 26: కలియుగ వైకుంఠం తిరుమలలో ఈనెల 29వ తేదీ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపటనున్న ‘‘వనం-మనం’’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్టర్ డి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం సీనియర్ అధికారులతో ఇ ఓ వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు.

07/27/2016 - 05:43

తిరుపతి, జూలై 26: రైతులకు చేయూతనివ్వడంతో పాటు ప్రజలకు కూడా న్యాయమైన ధరలకు కూరగాయలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ నేపథ్యంలో రైతు బజార్‌లో సూచికబోర్డుపై ఉన్న ధరలకే విక్రయించాలని రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ఎస్ అయ్యప్పన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

07/27/2016 - 05:43

చంద్రగిరి, జూలై 26: చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో శ్రీ కనకదుర్గాంబ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు పుష్పపల్లకీపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం శ్రీ కనకదుర్గాంబ దేవాలయ ఆవరణలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

07/27/2016 - 05:42

తిరుపతి, జూలై 26: హలాల్ చేయడానికి తీసుకెళ్తున్న ఓ పొట్టేలు పారిపోయిందని యజమాని కొట్టిన రెండు దెబ్బలకు ఓ కార్మికుడు మృతిచెందిన సంఘటన మంగళవారం తిరుపతిలో సుభాష్ నగర్‌లో జరిగింది. వివరాల్లోకెళితే.. లీలామహల్ సెంటర్‌లో షేక్ మహ్మద్ అలీ మాంసపు దుకాణం నడుపుతున్నాడు. ఆయన వద్ద షేక్ గులాబ్ (32) పనిచేస్తున్నాడు.

07/27/2016 - 05:40

రాజమహేంద్రవరం, జూలై 26: ఎంత ఆధునికీకరణ జరిగినా రాజమహేంద్రవరం పేపర్ మిల్లు కాలుష్యం నుంచి రక్షణ లేకుండా పోయింది. కాలుష్య ప్రభావం బహుముఖంగా ఆవరిస్తూనే వుంది. గోదావరి నది ఒడ్డున వున్న పేపర్ మిల్లు నుంచి వెలువడే వ్యర్థ వాయువులు పరిసర ప్రాంతాన్ని శీతాకాలంలో మాదిరిగా పొగమంచులా కమ్మేస్తోంది. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యాన్ని నివారించాలని పరిసర ప్రజలు ఇటీవల ఆందోళన కూడా వ్యక్తం చేశారు.

07/27/2016 - 05:39

రాజమహేంద్రవరం, జూలై 26: తూర్పులో ఖరీఫ్ నాట్లు మందగమనంలో సాగుతున్నాయి. జూలై 15కల్లా నాట్లు పూర్తయితే అక్టోబర్ చివరి వారానికి కోతలు పూర్తికావాల్సి వుంది. ఈ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రైతులు ఖరీఫ్ వ్యవసాయ పనులు పూర్తిచేసుకుంటే.. తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి పంటను కాపాడుకోవచ్చని వ్యవసాయ ప్రణాళిక. జూన్ ఆరవ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాకు కాటన్ బ్యారేజి నుంచి కాల్వలకు నీరిచ్చారు.

07/27/2016 - 05:39

కాకినాడ, జూలై 26: హెచ్‌ఐవి/ఎయిడ్స్ బాధితుల కోసం ప్రతి ఒక్కరు ఉదారంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. హెచ్‌ఐవి బాధితుల కోసం రిలయన్స్ ఆధ్వర్యంలో చిరుదీపం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం పలువురికి స్ఫూర్తిదాయకం కావాలన్నారు. జిల్లా కేంద్రం కాకినాడలోని రోటరీ హాలులో మంగళవారం చిరుదీపం కార్యక్రమం కింద ఏర్పాటుచేసిన సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

07/27/2016 - 05:38

రాజమహేంద్రవరం, జూలై 26: అంత్య పుష్కరాలకు మరో నాలుగు రోజులు మాత్రమే గడువున్నా ఏర్పాట్లు ఇప్పటికీ అధ్వాన్నంగా ఉండటంపై ఎమ్మెల్సీ, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏర్పాట్లపై వెంటనే మేధావులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన అంత్య పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు.

07/27/2016 - 05:37

రాజవొమ్మంగి, జూలై 26: గల్లంతైన ఎఎన్ 32 వాయుసేన విమానం ఆచూకీ కోసం ఏజెన్సీ ప్రాంతంలో నౌకాదళ హెలీకాప్టర్ల సహాయంతో మంగళవారం విస్తృతంగా గాలింపుచేపట్టారు. ఈ నెల 22న నాగులకొండ పర్వతం సమీపంలో ఒక విమానం పెద్ద శబ్దం చేసుకొంటూ వెళ్లడం చూశామని గిరిజనులు చెప్పడంతో ఆ ప్రాంతంలో అధికారులు గాలింపుచేపట్టారు.

07/27/2016 - 05:37

కోటనందూరు, జూలై 26: దశాబ్దాల కాలం నుండి తాండవ గేట్లకు మరమ్మతులు లేక సాగునీరు వృథాగా పోయేది. ఈ సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టి పనులు పూర్తిచేశారు. తాండవ జలాశయం నుండి ఏళ్లతరబడి క్రస్ట్ గేట్లనుండి నీరు వృథాగా పోతోంది. దీనిపై అనేక పర్యాయాలు ఆయకట్టుదారుల సమావేశంలో రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

Pages