S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 05:36

అమలాపురం, జూలై 26: రాష్ట్ర ప్రత్యేక హోదా బిల్లుపై తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు పార్లమెంటు సాక్షిగా దొంగాట ఆడుతున్నాయని మాజీ ఎమ్మెల్సీ, పిసిసి ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు ఆరోపించారు. మంగళవారం అమలాపురంలో ఆయన స్వగృహంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ప్రత్యేక హోదా బిల్లుపై టిడిపి, బిజెపిల ద్వంద్వ వైఖరిని దుయ్యబట్టారు.

07/27/2016 - 05:34

పిఠాపురం, జూలై 26: గోదావరి నీటిని ఏలేరుకు అనుసంధానం చేయడం పిఠాపురం రైతుల కష్టాలు తీరి వారి కల నెరవేరేందుకు సుమారు రూ. 1150 కోట్ల అంచనాతో డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేస్తున్నట్టు పిఠాపురం ఎమ్మెల్యే వర్మ తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

07/27/2016 - 05:34

హైదరాబాద్, జులై 26: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్వాసితులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జిని నిరసిస్తూ కదం తొక్కాలనుకున్న కాంగ్రెస్ వ్యూహాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మల్లన్న సాగర్‌కు చేరుకోవాలని కాంగ్రెస్ నేతలు చేసిన వ్యూహం విఫలమైంది. పార్టీ నేతలు, శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.

07/27/2016 - 05:33

మండపేట, జూలై 26: వ్యసనాలకు బానిసలై మహిళను ఎరగావేసి, దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను మండపేట పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి లక్షా 33 వేల రూపాయలు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులుగా పేర్కొన్నవారిని మంగళవారం ఆలమూరు కోర్టులో హాజరుపరచనున్నట్లు మండపేట పట్టణ సిఐ కె హ్యాపీ కృపావందనం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.

07/27/2016 - 05:33

కాకినాడ, జూలై 26: అంగన్‌వాడీలు బాలలు భవిష్యత్తుకు నిర్దేశకులని, వారికి మంచి పౌష్టికాహారం అందించి దేశానికి వనె్న తెచ్చే విధంగా తయారుచేయాలని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సూచించారు. మంగళవారం ఎస్‌ఆర్‌ఎంటి ఫంక్షన్ హాలులో మహిళా శిశు సంక్షేమ శాఖచే ఏర్పాటు చేసిన ప్రేరణ కార్యక్రమానికి చాగంటి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చాగంటి మాట్లాడుతూ సమాజంలో మహిళలకు చాలా గౌరవముందన్నారు.

07/27/2016 - 05:30

తెనాలి, జూలై 26: పట్టిసీమ నుండి కృష్ణానదికి సాగునీరు రావటంతో పశ్చిమ డెల్టా రైతులు హర్షం వ్యక్తంచేస్తూ ఈఖరీఫ్‌కు వరి పంటలు వేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే బోర్లు కింద ఉన్న భూముల్లో నారుమళ్ళు వేసిపెంచుతున్నారు. దాదాపుగా ఎనిమిది మండలాల్లో వరి పంట నాటు వేసేందుకు అన్నదాతలు సిద్ధమయ్యారు.

07/27/2016 - 05:29

గుంటూరు (కొత్తపేట), జూలై 26: మున్సిపల్ కార్మికులు గత ఏడాది చేపట్టిన సమ్మెకాలపు 16 రోజుల వేతన జీవోను వెంటనే విడుదల చేయాలంటూ మునిసిపల్ కార్మికులు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు.

07/27/2016 - 05:29

పొన్నూరు, జూలై 26: అభివృద్ధి పేరిట ఎనె్నన్నో అక్రమాలకు పాల్పడవచ్చని రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం తన చర్యల ద్వారా లోకానికి చాటిచెప్తోందని మాజీ మంత్రి, వైసిపి నేత ధర్మాన ప్రసాదరావు విమర్శించారు.

07/27/2016 - 05:29

హైదరాబాద్, జూలై 26: అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. మరో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. గడిచిన 24 గంటలుగా ఉత్తర తెలంగాణలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా వరంగల్ జిల్లా నర్మెట్టలో 12 సెమీ వర్షపాతం నమోదైంది.

07/27/2016 - 05:28

గుంటూరు (కార్పొరేషన్), జూలై 26: రాష్ట్ర ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వనం - మనం కార్యక్రమంలో భాగంగా నగరంలో సుమారు 30 వేల మొక్కలను నాటేందుకు కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ నాగలక్ష్మి తెలిపారు. మంగళవారం కౌన్సిల్ సమావేశ మందిరంలో వార్డు లెవల్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

Pages