S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హరిత ‘అనంత’కు శ్రీకారం

అనంతపురం, జూలై 26 : మిషన్ హరితాంధ్రప్రదేశ్‌లో భాగంగా జిల్లాను హరిత ‘అనంత’గా మార్చేందుకు అటవీ శాఖ కృ షి చేస్తోంది. ఇందులో భాగంగా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు ఈనెల 29న 67వ వన మహోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా 1100 ప్రదేశాల్లో 10.30 లక్షల మొక్కలు నాటేందుకు 39 రకాల మొక్కలను సిద్ధం చేశారు. అటవీ శాఖకు సంబంధించిన అడవులు, ప్రాంతాలతో పాటు గృహాలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, పరిశ్రమలు, రైల్వే ట్రాకులకు ఇరువైపులా, రైల్వే స్థలాలు, బోడి కొండలు, పొలం గట్లు, గుట్టలు, ఎంపిక చేసిన ఇతరత్రా స్థలాలల్లో ఆయా ప్రాంతాలకు అనుగుణంగా మొక్కలు నాటనున్నారు. ఇందులో చింత, ఉసిరి, సీతాఫలం, వేప, జువ్వి, మర్రి, జామ, కరివేపాకు, మునగ, బొప్పాయి, గోరింటాకు తదితరాలు మొక్కలు ఉన్నాయి. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే వన మహోత్సవాన్ని వర్షాకాలం పొడవునా ప్రతి నియోజకవర్గం, రెవెన్యూ డివిజన్, మండల స్థాయిల్లో కొనసాగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాల్లో సంబంధిత ఆర్డీఓలు, ఎంపిడిఓలు, తహశీల్దార్లు, వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొననున్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు కలెక్టర్ జిల్లావ్యాప్తంగా 14 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. కాగా జిల్లా స్థాయి వన మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాయదుర్గం మండలం కెంచానపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం వద్ద ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లామంత్రులు, కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు, సంబంధిత రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల అధికార, అనధికార ప్రముఖులు పాల్గొననున్నారు.
హరిత అనంతగా మారుస్తాం..
* అటవీశాఖ అధికారి చంద్రశేఖర్
జిల్లాను హరిత అనంతగా మార్చేందుకు వివిధ రకాల చర్యలు తీసుకుంటున్నాం. మిషన్ హరితాంధ్ర ప్రదేశ్‌లో భాగంగా జిల్లాలోని వివిధ నర్సరీల ద్వారా వన మహోత్సవానికి మొక్కలు సిద్ధంగా ఉంచాం. వన మహోత్సవంలో ప్రజలు, అధికార, అనధికారులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలి...