S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఫ్యాక్షన్, రౌడీయిజంపై ఉక్కుపాదం

అనంతపురం, జూలై 26 : జిల్లాలో ఫ్యాక్షన్, రౌడీయిజంపై ఉక్కుపాదం మోపి పూర్తిస్థాయిలో అణచి వేయాలని రేంజ్ డిఐజి జె.ప్రభాకర్‌రావు, ఎస్పీ ఎస్‌వి.రాజశేఖరబాబు పోలీసు అధికారులను ఆదేశించారు. ఇటీవల జిల్లాకేంద్రంలో జరిగిన రౌడీషీటర్ల జంటహత్యల నేపథ్యంలో అనంతపురం సబ్ డివిజన్ పోలీసు అధికారులతో మంగళవారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ముందుగా అనంతపురం సబ్ డివిజన్ పరిధిలోని ఫ్యాక్షన్ గ్రామాలతోపాటు ఫ్యాక్షనిస్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫాక్షన్ నేపథ్యంలో ఏచిన్న సంఘటన జరిగినా సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి ఫ్యాక్షనిస్టులు, వారి అనుచరులపై నిత్యం నిఘా ఉంచాలన్నారు. గ్రామ పోలీసు అధికారులను నిరంతరం అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం సేకరించి చర్యలు చేపట్టాలన్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ పటిష్టంగా పని చేయాలన్నారు. ఫ్యాక్షన్ ఘటనల్లో నిందితులకు శిక్షలు పడేలా పోలీసుల చర్యలు ఉండాలని సూచించారు. జంటహత్యలు వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అరాచకాలు సృష్టించే ఎంతటి వారైనా ఉపేక్షించరాదన్నారు. ప్రధానంగా రౌడీయిజం జిల్లాలో ఎక్కడా కనిపించరాదన్నారు. సమాజ శాంతికి భంగం కలిగించే రౌడీషీటర్లను స్టేషన్లకు పిలిపించి హెచ్చరికలు చేయాలన్నారు. తప్పు చేసే ఏ రౌడీషీటర్‌ను వదలకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. అలాగే భూబకాసురులపై ప్రత్యేక నిఘా వేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, బైండోవర్లు చేయాలని, కౌనె్సలింగ్‌లు చేపట్టాలని ఆదేశించారు. రక్షక్, బ్లూకోట్స్, డే బీట్లను గట్టిగా వినియోగించుకోవాలన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని కేసుల్లో పురోగతి సాధించాలన్నారు. పోలీసులు పరస్పర సహకారంతో శాంతిభద్రతలు కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో అనంతపురం డిఎస్పీ మల్లికార్జునవర్మ, స్పెషల్ బ్రాంచి డిఎస్పీ సిఎం. గంగయ్య, ఇన్‌స్పెక్టర్ బి.రాజశేఖర్, అనంతపురం సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.