S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

ఘనంగా పామిడమ్మ జాతర

పామిడి, జూలై 26: పట్టణంలోని జాతీయ రహదారి సమీపంలో గ్రామ దేవతగా వెలసిన పామిడమ్మ జాతరను భక్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీ విఠోబా స్వాముల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉట్లతేరు ముగిసిన అనంతరం ఆషాడ బహుళ తదియ మంగళవారం పామిడమ్మ జాతరను నిర్వహించటం ఆనవాయితీ. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల రద్దీతో పామిడమ్మ దేవాలయం సమీపమంతా కిటకిటలాడింది. మహిమాన్వితురాలైన పామిడమ్మను పూజించుట ద్వారా పామిడంతా సుభిక్షంగా ఉంటుందన్నది ప్రజల నమ్మకం. దేవాలయంలోని అర్చకులు పామిడమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించగా భక్తులు కోరిన కోరికలను తీర్చే కొంగుబంగారంగా పిలువబడుతున్న పామిడమ్మ అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలను చేపట్టి తీర్థ ప్రసాదాలను స్వీకరించి భక్తులు అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.