S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 05:28

మేడికొండూరు, జూలై 26: నెట్ కనెక్ట్ అవదు, సర్వర్లు మొరాయిస్తున్నాయి, ట్యాబ్‌లు, సిమ్‌లు పనిచేయకపోవడం వల్ల సాధికార సర్వే ముందుకు సాగడం లేదు.. సర్వేబృందాలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం సాధికార సర్వేను ప్రతిష్ఠాత్మకంగా ఈనెల 8వ తేదీ నుండి ప్రారంభించింది.

07/27/2016 - 05:27

గుంటూరు, జూలై 26: హరితాంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఈనెల 29న రాష్టవ్య్రాప్తంగా చేపట్టనున్న వనం-మనం కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వాములను చేసి విజయవంతం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వనం-మనం కార్యక్రమం, కృష్ణా పుష్కరాల పనుల పురోగతి, ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.

07/27/2016 - 05:26

మంగళగిరి, జూలై 26: దళిత వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలోని టిడిపి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఎస్సీ సబ్‌ప్లాన్ ద్వారా బడ్జెట్‌లో 12వేల కోట్ల రూపాయలు ఎస్సీల సంక్షేమానికి కేటాయించి అభివృద్ధి పనులు చేస్తున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు.

07/27/2016 - 05:26

అమరావతి, జూలై 26: రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సిఆర్‌డిఎ ల్యాండ్ ఎక్విజేషన్ విభాగం స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ మనోరమ మంగళవారం ధ్యానబుద్ధ ప్రాజెక్టు ఎదురుగా గల 16.39 ఎకరాల తాలూకు భూమిపై రైతుల వద్ద అభ్యంతరాలను స్వీకరించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తహశీల్దార్ కె నాసరయ్య అధ్యక్షతన స మావేశం జరిగింది.

07/27/2016 - 05:26

గుంటూరు (కార్పొరేషన్), జూలై 26: రానున్న కృష్ణాపుష్కరాలలో భాగంగా నగరంలోని పుష్కర్‌నగర్, రైల్వే, బస్‌స్టేషన్లలో పారిశుద్ధ్య పనులు పక్కాగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ డెప్యూటీ కమిషనర్లు యేసుదాసు, శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం స్థానిక కౌన్సిల్ సమావేశమందిరంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

07/27/2016 - 05:25

గుంటూరు, జూలై 26: నిత్యావసర వస్తువుల ధరలు చూస్తే ఆకాశమే హద్దుగా పెరుగుతూ సామాన్యులు ధరాఘాతానికి గురవుతున్నారని, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని వైసిపి రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం 26వ డివిజన్ కృష్ణబాబు కాలనీలోని హెల్త్‌సెంటర్ నుండి గడప గడపకు వైసిపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

07/27/2016 - 05:24

పొన్నూరు, జూలై 26: చేనేత పరిశ్రమ అభివృద్ధికి నేతన్న సమస్యల పరిష్కారానికి తుదిశ్వాస విడిచే వరకు పోరాటం సాగించి అమరుడై చేనేత బంధువుగా జగద్విఖ్యాతి గాంచిన ప్రగడకోటయ్య చిరస్మరణీయులని పలువురు వైసిపి నేతలు కొనియాడారు. దివంగత ప్రగడ జయంతి సందర్భంగా స్థానిక వీవర్స్ కాలనీలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

07/27/2016 - 05:24

న్యూఢిల్లీ, జూలై 26: పధ్నాలుగేళ్లలోపు వయసు పిల్లల్ని పనిలో పెట్టుకోవడాన్ని నిషేధిస్తూ పార్లమెంట్ మంగళవారం కీలక బిల్లును ఆమోదించింది. ఈ నిబంధన ఉల్లంఘించిన యాజమాన్యాలకు రెండేళ్ల జైలు శిక్ష విధించేందుకు, ఆ పిల్లల తల్లిదండ్రులపైనా జరిమానా విధించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది.

07/27/2016 - 05:22

ఖమ్మం, జూలై 26: రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి బలంగా ఉందని, అన్ని పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు తమ పార్టీలో చేరడంతో తమకు ప్రత్యర్థులే లేరని చెప్పుకున్న అధికార టిఆర్‌ఎస్ పార్టీకి ఆర్టీసి కార్మికులు గట్టి షాక్ ఇచ్చారు.

07/27/2016 - 05:22

ఖమ్మం(ఖిల్లా), జూలై 26: మెదక్ జిల్లా మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అయితం సత్యంతో సహా పలువురు కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు.

Pages