S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

హారికకు ఐదో ర్యాంకు

జియాగ్జింగ్ (చైనా), జూలై 26: అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లలో గత రెండు నెలల నుంచి దుమ్మురేపుతున్న తెలుగు తేజం, గ్రాండ్ మాస్టర్ ద్రోణవల్లి హారిక ప్రపంచ టాప్-10 ర్యాంకింగ్స్‌లో మరింత ఉన్నత స్థానానికి దూసుకెళ్లింది. ఇంతకుముందు ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచిన హారిక మంగళవారం తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్‌లో ఏకంగా ఐదు స్థానాలను మెరుగుపర్చుకుని ఐదో ర్యాంకుకు ఎగబాకింది. చైనాలోని చెంగ్డూలో ఇటీవల మహిళల ఫైడ్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను కైవసం చేసుకుని ప్రస్తుతం చైనా చెస్ లీగ్‌లో ఆడుతున్న హారిక మంగళవారం వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న షాండాంగ్ జట్టును పోల్ పొజిషన్‌కు తీసుకెళ్లింది.