S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/27/2016 - 05:14

వేదాయపాళెం, జూలై 26: ఆసుపత్రులలో కాన్పు అయిన వారికి ఒక మొక్కను ఇచ్చి బిడ్డతోపాటు ఆ మొక్కను కూడా పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అధికారులను సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పకృతి అనేది చాల ముఖ్యమని, చెట్లు పకృతిని కాపాడుతాయన్నారు.

07/27/2016 - 05:14

ఆత్మకూరు, జూలై 26: ఇద్దరు కుమారుల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచి పెద్ద చేయగా వారు మాత్రం ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకున్నా జీవిత చరమాంకానికి చేరుకున్న తల్లిని మాత్రం ఆదరించక నిర్లక్ష్యపరుస్తున్న వ్యవహారంపై ఆత్మకూరు ఎస్సై ఎం పూర్ణచంద్రరావు విచారణ జరుపుతున్నారు.

07/27/2016 - 05:13

నెల్లూరు, జూలై 26: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద దళితులను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసేందుకు 1,100 కోట్లతో దాదాపు లక్ష మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు వెల్లడించారు. మంగళవారం స్థానిక కస్తూరిదేవి గార్డెన్ హాలులో షెడ్యూల్డ్ కులాల లబ్ధిదారులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

07/27/2016 - 05:12

నెల్లూరు రూరల్, జూలై 26: ప్రజాసాధికారత సర్వే సమగ్రంగా, జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ నెల్లూరు ఆర్‌డిఓ కార్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్యాలయంలో ఉన్న అధికారులను ఆయన పరిచయం చేసుకున్నారు. అనంతరం కలెక్టర్ ఆకస్మికంగా వెంకటేశ్వరపురం, బోడిగాడితోట ప్రాంతాల్లో సర్వే ప్రక్రియను పరిశీలించారు.

07/27/2016 - 05:12

నెల్లూరు, జూలై 26: అనుమానం పెంచుకున్న భర్త అమానుషంగా మారడంతో ఓ అబల జీవితం బలైపోయింది. తండ్రి లేని ఆ చిన్నారులు చివరకు తల్లిని కూడా కోల్పోయి అనాథలుగా మిగిలారు. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన మార్తాల సుమలత (26)కు రవీంద్రబాబుతో ఏడేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు కుమారులు.

07/27/2016 - 05:11

నెల్లూరు, జూలై 26: జిల్లాలోని పట్టణ పేదల సొంతింటి కల నెరవేరబోతోంది. పట్టణ పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం అందరికీ ఇళ్లు పథకాన్ని ప్రవేశపెట్టింది. తొలి విడతలో ఇళ్లు పొందడానికి దాదాపు సుమారు 5నెలల క్రితమే వేలాది మంది నగరపాలక, పురపాలక సంస్థల్లో దరఖాస్తులు సమర్పించారు. మొదటి దశలో వచ్చిన దరఖాస్తులపై ఆయా పురపాలక, నగరపాలక సంస్థ అధికారులు సర్వే పూర్తి చేశారు.

07/27/2016 - 05:10

కోట, జూలై 26: ప్రత్యేక హోదా విషయమై టిడిపి ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరించడంలేదని డిసిసి అధ్యక్షులు పనబాక కృష్ణయ్య ధ్వజమెత్తారు. మంగళవారం కోటలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సుముఖత చూపడంలేదన్నారు.

07/27/2016 - 05:10

చిల్లకూరు, జూలై 26: మండలంలోని పునపువారిపాలెం గ్రామానికి చెందిన 14 సంవత్సరాల ఓ మైనర్ గిరిజన బాలికపై అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడని మంగళవారం బాలిక తల్లిదండ్రులు చిల్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అంకమ్మ తెలిపారు.

07/27/2016 - 05:09

వేదాయపాళెం, జూలై 26: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం నుంచి యాజమాన్య కమిటీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖాధికారుల ఉత్తర్వుల మేరకు అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆయా ప్రధానోపాధ్యాయులు నోటిఫికేషన్ విడుదల చేయడంతో హడావుడి నెలకొంది. ఈ ఎన్నికలకు సంబంధించి మధ్యాహ్నం ఓటర్ల జాబితాలను ఆయా పాఠశాలల నోటీస్ బోర్డులపై అతికించారు.

07/27/2016 - 05:09

నెల్లూరు, జూలై 26: నిరుద్యోగ ఎస్సీ యువతకు ఆర్థిక భరోసా కల్పించే చర్యల్లో భాగంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 250 కాబ్‌లను అందచేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు వెల్లడించారు. మంగళవారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ, విశాఖపట్టణం నగరాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

Pages