S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

గల్లంతైన విమానం కోసం గాలింపు

రాజవొమ్మంగి, జూలై 26: గల్లంతైన ఎఎన్ 32 వాయుసేన విమానం ఆచూకీ కోసం ఏజెన్సీ ప్రాంతంలో నౌకాదళ హెలీకాప్టర్ల సహాయంతో మంగళవారం విస్తృతంగా గాలింపుచేపట్టారు. ఈ నెల 22న నాగులకొండ పర్వతం సమీపంలో ఒక విమానం పెద్ద శబ్దం చేసుకొంటూ వెళ్లడం చూశామని గిరిజనులు చెప్పడంతో ఆ ప్రాంతంలో అధికారులు గాలింపుచేపట్టారు. విశాఖ నుండి వచ్చిన హెలీకాప్టర్లు ఒకటి గొబ్బిలమడుగు అటవీ ప్రాంతంలో, మరొకటి లోదొడ్డి అటవీ ప్రాంతంలో మూడు గంటలపాటు గాల్లో చక్కర్లు కొట్టాయి. లోదొడ్డి అటవీ ప్రాంతంలో బాగా కిందకు దిగిన హెలీకాప్టర్ అణువణువునా పరిశీలించింది. ఆకాశం మబ్బులతో కూడి ఉండడం, వర్షం పడడంతో హెలీకాప్టర్లు వెనుతిరిగి వెళ్లిపోయాయి. దట్టమైన అటవీ ప్రాంతంలో, రెండు పెద్ద కొండల మధ్య విమానం కూలి పోయి ఉండవచ్చనే అనుమానంతో ఆ ప్రాంతంపై దృష్టిసారించారు.
కాగా విశాఖ నుండి వచ్చిన నౌకాదళ ఇంటిలిజెన్సు అధికారుల బృందం ఒకటి రాజవొమ్మంగి మండలంలో మారుమూల పల్లెలైన కొమరాపురం, వాతంగి గ్రామాలకు వెళ్లి గల్లంతైన విమానం కోసం ఆరాతీశారు. వారి సూచనలు, ఆదేశాల మేరకు హెలీకాప్టర్లు గాలింపు చేపడుతున్నాయి. శుక్రవారం ఉదయం ఒక విమానం తక్కువ ఎత్తునుండి పెద్ద శబ్ధం చేసుకొంటూ తూర్పు దిక్కున వెళ్లడం చూశామని గిరిజనులు అధికారులకు తెలిపారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, గిరిజనుల నుండి సమాచారంకై వేచి చూస్తున్నామని, తమ సిబ్బంది మారుమూల లోతట్టు గ్రామాల్లో దర్యాప్తు చేస్తున్నారని జడ్డంగి ఎస్సై నాగార్జున తెలిపారు. నౌకాదళ అధికారులు కూడా గత రెండు రోజులుగా ఏజెన్సీలో విమానం ఆచూకీకై గాలింపు చేపడుతున్నారని ఎస్సై తెలిపారు.