S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

శ్రీనివాసమంగాపురంలో వైభవంగా పుష్పపల్లకి వాహనం

చంద్రగిరి, జూలై 26: చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలో శ్రీ కనకదుర్గాంబ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు పుష్పపల్లకీపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం శ్రీ కనకదుర్గాంబ దేవాలయ ఆవరణలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీనివాసమంగాపురంలో 600 సంవత్సరాల క్రితం రఘువంశీ క్షత్రియ రామయ్య జవేరి కులానికి చెందినటువంటి సింగ్ కులస్థులు ఉత్తరాది నుంచి దక్షిణాదికి తరలివచ్చారు. కుగ్రామం కూడా లేని శ్రీనివాసమంగాపురంలో విడిదిచేసి స్వర్ణముఖి నది వరదలో సంధ్యావందనం చేయిస్తుండగా అమ్మవారు శక్తి స్వరూపం బాలిక రూపంలో ప్రదర్శితమై ఆమె శక్తి బయల్పరచగా సింగ్‌లు వంకలో దొరికిన విగ్రహాన్ని ఇక్కడ స్థాపించి గుడిని నిర్మించారు. ప్రతి యేటా ఆషాడమాసంలో క్రమం తప్పకుండా అమ్మవారి జాతర నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ కనకదుర్గాంబ సేవాసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సింగ్ కులస్థులు ఇక్కడికి చేరుకొని ప్రతి ఇంట ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఎపి, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్టల్ర నుంచి పెద్ద ఎత్తున సంగ్ కులస్థులు ఈ జాతరలో పాల్గొన్నారు. 1983లో ఏర్పడిన శ్రీ కనకదుర్గాంబ సేవా కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమంలో ధన సింగ్, అశోక్ సింగ్, వివేక్ సింగ్, సురేంద్రసింగ్, రాజు సింగ్ పాల్గొన్నారు.