S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

‘చిరుదీపం’ స్ఫూర్తినివ్వాలి

కాకినాడ, జూలై 26: హెచ్‌ఐవి/ఎయిడ్స్ బాధితుల కోసం ప్రతి ఒక్కరు ఉదారంగా ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. హెచ్‌ఐవి బాధితుల కోసం రిలయన్స్ ఆధ్వర్యంలో చిరుదీపం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం పలువురికి స్ఫూర్తిదాయకం కావాలన్నారు. జిల్లా కేంద్రం కాకినాడలోని రోటరీ హాలులో మంగళవారం చిరుదీపం కార్యక్రమం కింద ఏర్పాటుచేసిన సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవి బాధితులకు పౌష్టికాహార కిట్లు, విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారు. సమావేశంలో కలెక్టర్ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హెచ్‌ఐవి బాధితుల కోసం ప్రత్యేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు సేవాకార్యక్రమాలు విరివిగా నిర్వహించాలని కోరారు. ఎయిడ్స్ పీడితులు పౌష్టికాహారాన్ని తీసుకుంటూ, ఆహార నియమాలను పాటించడం ద్వారా జీవిత కాలాన్ని పెంచుకోవచ్చని సూచించారు. జిల్లాలో రిలయన్స్, ఒఎన్‌జిసి, కాకినాడ సీపోర్టు వంటి సంస్థలు అన్నదీవెన పథకం కింద ఆసుపత్రుల్లో ప్రసవించిన సుమారు 10 వేల మంది బాలింతలకు ప్రత్యేక పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశాయన్నారు. ఎయిడ్స్ బాధిత పిల్లలచే తప్పనిసరిగా మందులు వాడించడం, వారికి పౌష్టికాహారాన్ని అందజేయడంతో పాటు అటువంటి వారు తప్పనిసరిగా పాఠశాలల్లో చేరేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రిలయన్స్ హెడ్ (సపోర్ట్స్, సర్వీసెస్) రవిచంద్రన్ మాట్లాడుతూ చిరుదీపం పథకానికి ఆదాయ పన్ను నుండి మినహాయింపు లభించిందన్నారు. గతంలో చేంజెస్ అనే స్వచ్ఛంద సంస్థ స్ఫూర్తితో రిలయన్స్ ఉద్యోగులు ఎయిడ్స్ బాధితులను ఆదుకునేందుకు ముందుకువచ్చినట్టు చెప్పారు. ఈ విధంగా 85 మంది పిల్లలకు సహాయాన్ని అందించడం, వారి ఆరోగ్య పరిరక్షణ, పాఠశాల చదువు కోసం వాలంటీర్లుగా పనిచేస్తున్నట్టు వివరించారు. ఇన్‌టాక్ సభ్యురాలు ఎల్ శేషుకుమారి, పౌర సంబంధాల అధికారి ఎం ఫ్రాన్సిస్, పరివర్తన సంస్థ ప్రతినిధి రామకృష్ణ, ఉమా మనోవికాస కేంద్రం ప్రతినిధి ఎస్‌పి రెడ్డి, రిలయన్స్ ప్రతినిధులు ఎన్ రమణమూర్తి, పి సుబ్రహ్మణ్యం, ఎస్ రమణారావు పాల్గొన్నారు.