S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/26/2016 - 00:14

వృక్ష సంపద, అడవులు, సరైన కొండవాలు, గాలి లేకపోతే వర్షాలు పడవు. ఇది సామాన్యంగా బుద్ధెరిగిన ఎవరైనా చెబుతారు. ప్రభుత్వాల నిర్వాకం, పది వృక్షాలు కొట్టి, వంద మొక్కలు నాటు అన్నట్లు ఉంది. పది వృక్షాలు పోతున్నాయ కాని, ఐదు వృక్షాలు కూడ పెరగడంలేదు. నాటిన మొక్కల సంరక్షణను పట్టించుకోకపోతే, అవి పెరగడం కష్టం కదా. అందువల్ల ప్రభుత్వం మీన మేషా లు మాని సక్రమంగా అడవుల పెంపకానికి పూనుకోవాలి.

07/26/2016 - 00:12

రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవనేది మరోసారి భాజపా రుజువు చేసింది. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశంలోని అతి పెద్ద దళిత నాయకురాలు మాయావతిని వేశ్యతో పోల్చటం ద్వారా భాజపా రాజకీయ ఆత్మహత్యాకు ప్రయత్నించింది. ఎన్నికలకు ముందు తమ కాళ్లను తామే నరుక్కోవటం భాజపాకు వెన్నతో పెట్టిన విద్యగా మారుతోంది.

07/26/2016 - 00:10

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు కొన్ని నెలలుగా కొన్ని కేంద్రాలకు కందిపప్పు సరఫరా నిలిచిపోయి అనేక అవస్థలు పడుతున్నారు. గర్భిణి, బాలింతలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు సంపూర్ణ పౌష్టికాహారం కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనేక పథకాల్ని అమలుపరిచి ఈ పథకాల కింద కందిపప్పు, ఆకుకూరలు, కోడిగుడ్డుతోపాటు ఇతర సామగ్రితో మధ్యాహ్న భోజనం అందించాల్సి వుంటుంది.

07/26/2016 - 00:03

ముస్లిం జనాభా అధికంగా ఉండే దేశాల్లో మలేసియా ఒకటి. ఇక్కడికి జకీర్ నాయక్ రావడంపై నిషేధం విధించారు. ఇంకా 16 ముస్లిం దేశాలలో ఈ యనపై నిషేధం అమల్లో ఉంది. ఢాకాలో, కిషన్‌గంజ్‌లో వరుస బాంబుపేలుళ్లు జరిగిన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం అప్రమత్తమై జకీర్ ప్రసంగాల వీడియోలపై నిషేధం విధించింది. ఆ దేశపు హోంశాఖామాత్యులు ప్రసంగిస్తూ, ‘జకీర్ ప్రసంగాలు, వీడియోలు పర్యటనలపై నిఘావిభాగం దృష్టి పెట్టింద’ని ప్రకటించారు.

07/25/2016 - 23:51

గద్వాల, జూలై 25: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 15వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్నట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 318.47 మీటర్ల స్థాయిలో నీరు నిల్వ ఉండగా ఎగువ ప్రాంతం నుంచి 15వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది.

07/25/2016 - 23:50

వనపర్తి, జూలై 25: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, పంచాయతి రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావులు అన్నారు. సోమవారం వనపర్తి డివిజన్ వీపనగండ్ల మండల పరిధిలోని గోవర్ధనగిరి, పెద్దదగడ, చిన్నంబావిలలో హరితహారంలో పాల్గొని వారు మొక్కలు నాటారు.

07/25/2016 - 23:49

నాగర్‌కర్నూల్, జూలై 25: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో రాబోయే రోజులలో బజారున పడతామనే భయంతోనే ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నాయని రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆరోపించారు.

07/25/2016 - 23:48

మహబూబ్‌నగర్, జూలై 25: జిల్లా మంత్రులు జీవచ్ఛవాలు అయ్యారని వారికి పరిపాలన విధానమే తెలియదని వారి శాఖల్లో ఏమి జరుగుతుందో తెలియకుండా పోయిన అసమర్థులని వీరి కారణంగా జిల్లా నాశనం అవుతుందని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి ఆరోపించారు.

07/25/2016 - 23:47

మక్తల్, జూలై 25: మక్తల్ మండలంతోపాటు నియోజకవర్గంలో జరిగే పుష్కరఘాట్ల పనులు సంబంధిత కాంట్రాక్టర్లు ఈనెలాఖరులోగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి సంబంధిత కాంట్రాక్టర్లను ఆదేశించారు.

07/25/2016 - 23:44

కరీంనగర్ టౌన్, జూలై 25: జిల్లా కేంద్రం కరీంనగర్‌లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా సుమారు గంట సేపు కుండపోత వర్షం కురిసింది. ఈ వర్షంతో రోడ్లన్నీ నీటితో నిండిపోగా, పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఇళ్ళల్లోకి నీరు రావడంతో ఆ నీటిని బయటకు బకెట్లతో పారబోశారు. రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

Pages