S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/25/2016 - 23:37

ఆదిలాబాద్, జూలై 25: హోంగార్డు బాధిత కుటుంబాలకు పోలీసు శాఖ ఆసరాగా నిల్చేందుకు ముందుంటుందని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల విధి నిర్వహణలో మృతి చెందిన బాధిత హోంగార్డు కుటుంబ సభ్యులకు రూ. 7లక్షల విలువైన చెక్కులను ఎస్పీ అందజేశారు.

07/25/2016 - 23:37

దండేపల్లి, జూలై 25: ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల సరిహద్దులో దండేపల్లి మండలం గూడెం గోదావరి నది వద్దపై గల పాత వంతెన ఆదివారం నుండి నీటమునిగింది. కడెం జళాశయం నుండి వరద గేట్లు ఏత్తడంతో వరద ఉదృతి పెరగడంతోగోదావరి లోలేవల్ వంతేన పైనుంచి వరద పారడంతో వంతెనను అధికారులు మూసివేసి రాకపోకలను బంద్ చేశారు.కోత్త వంతెన నుండి చిన్న వాహనాల అనుమతించారు.

07/25/2016 - 23:36

ఆదిలాబాద్, జూలై 25: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, దీనిపై అందోళనకు దిగిన రైతులపై లాఠీ చార్జి చేయడాన్ని నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, వామపక్ష పార్టీల అధ్వర్యంలోనిరసనలు మిన్నంటాయి. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కాగజ్‌నగర్ డివిజన్‌లలో ప్రభుత్వ నియంతృత్వ విధానాలను నిరసిస్తూ ధర్నాలు, రాస్తారోకో, నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

07/25/2016 - 23:36

ఉట్నూరు, జూలై 25: గిరి దర్బార్‌కు వచ్చే ఆర్జీలను పరిష్కరించి సత్వర పరిష్కారం కోసం కృషి చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులో భాగంగా సోమవారం గిరిజనుల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా గిరిజన దర్బార్‌కు వచ్చిన ప్రతి ధరఖాస్తులు ఏమేరకు పరిష్కారం అయ్యాయి, ఏ దశలో ఉన్నాయో శాఖల వారీగా సమీక్షించారు.

07/25/2016 - 23:35

దహెగాం, జూలై 25: మండలంలోని ఎర్రవాగు సోమవారం ఉగ్రరూపం దాల్చడంతో 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎర్రవాగు, పాల్వాయి పురుషోత్తం రావు ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీవర్షాలు కురవడంతో ఎర్రవాగులో భారీగా నీటిమట్టం పెరిగి ఎర్రవాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నారు.

07/25/2016 - 23:35

మంచిర్యాల, జూలై 25: మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్న అమాయక రైతులపై లాఠీచార్జ్జీ చేయడం అప్రజాస్వామికమని తూర్పు జిల్లా జెఎసి కన్వీనర్ గోనె శ్యాంసుందర్ రావు అన్నారు. సోమవారం జెఎసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

07/25/2016 - 23:34

దండేపల్లి, జూలై 25: మండల కేంద్రంలోని భవిత కేంద్రాన్ని జిల్లా రీసోర్స్ పర్సన్ లస్మన్న సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భవిత కేంద్రంలోని రికార్డులను ఆయన పరిశిలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రభుత్వం మంజూరు చేసిన అలవెన్స్‌లు కోంత మందికి సరిగా అందలేదని దీనికి కారణం భ్యాంక్ అకౌంట్లు సక్రమంగా ఇవ్వకపోవడమే అని ఆయన వివరించారు.

07/25/2016 - 21:37

భారీ అంచనాలతో అప్పుడప్పుడూ వస్తున్న చిత్రాలు ఒక్కసారిగా ఢామ్మంటున్నాయి. సరైనోడు చిత్రం తరువాత తెలుగు ప్రేక్షకులకు బిచ్చగాడు సినిమా ఒక్కటే ఫర్వాలేదనిపించింది. తరువాత ఒక్క చిత్రం కూడా బాక్సాఫీస్‌ను గలగలలాడించలేదు. ఈవారం భారీ అంచనాలమధ్య రజనీకాంత్ హీరోగా ‘కబాలి’, చిన్న చిత్రాలుగా గోపీనాథ్ నేతృత్వంలో ‘ట్వంటీఫస్ట్ సెంచరీ లవ్’, ఎక్స్‌వైజెడ్ చిత్రాలు విడుదలయ్యాయి.

07/25/2016 - 21:37

ఎంచుకున్న రంగంలో ఒకస్థాయి దాటివెళ్లిన సెలబ్రిటీల గురించి ఏ సమాచారం తెలిసినా అభిమానులకు ఒకింత అపురూపంగానే ఉంటుంది. అదే సనిమా రంగంలో అయితే, ఆ ఆర్థ్రత ఇంకొంచెం ఎక్కువే ఉండొచ్చు. ఒక్కోసారి అభిమాన నటుడో, నటో రొటీన్ లైఫ్‌లో ఏం చేస్తుంటుంది, వాళ్ల ఇష్టాయిష్టాలు, లేదూ సినియేతర చిత్రాలు, వాళ్లు వాడిన వస్తువులు, నివాసమున్న ప్రదేశాలు..

07/25/2016 - 21:37

ఫర్వాలేదు .. కబాలి
**
తారాగణం:
రజనీకాంత్, రాధికా ఆప్టే, ధన్సిక, నాజర్ తదితరులు
సంగీతం:
సంతోష్ నారాయణ్
నిర్మాత:
కలైపులి థాను
దర్శకత్వం:
పా రంజిత్
**

Pages