S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

,
07/25/2016 - 21:09

సామర్ల వెంకట రంగారావు. జన బాహుళ్యంలో ఎస్వీ రంగారావుగా పాపులరైన ఈ నటుడు మనకు దూరమై దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ దక్షిణాది ప్రేక్షకుల హృదయాలలో చిరంజీవిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఆయన నటించిన శాంతి రస పాత్రలను గుర్తుకుతెచ్చుకొంటే బంగారుపాప, పండంటి కాపురం, తాత మనవడు చిత్రాలు మచ్చుతునకలు.

07/25/2016 - 21:03

సినిమా సృజనాత్మక వ్యాపారమే. ఎవ్వరూ కాదనలేరు. అందుకోసమే ఏటా లెక్కకుమించి చిత్రాలు విడుదలవుతున్నా -సంస్కృతీ సంప్రదాయాన్ని, విలువలను నిలబెట్టే సినిమా ఒక్కటీ రావడం లేదన్నది మాత్రం ఎవ్వరూ కాదనలేని నిజం.
**

07/25/2016 - 20:59

తనకు మంచి అవకాశం ఇస్తే నేనేంటో చూపిస్తానంటోంది ఈ గ్లామర్ భామ? ఇంతకీ ఈమె ఎవరో తెలుసా? బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ రూపొందించిన ‘రమణ్ రాఘవ్ 2.0’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే ఆకట్టుకున్న తెలుగమ్మాయి -మిస్ ఇండియా ఎర్త్ శోభిత ధూళిపాళ. ఆ సినిమాతో ఈ అమ్మడికి చాలానే అవకాశాలు వస్తున్నాయట. గుంటూరుకు చెందిన ఈ అమ్మడు గ్లామరస్‌గా కనిపించేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తుంది.

07/25/2016 - 20:56

1960లో విడుదలైన దేవాంతకుడు తెలుగులో వచ్చిన తొలి సోషియో ఫాంటసీ చిత్రం. బెంగాలీ నవల ‘జమలాయేజీ బంతో మానుష్’ ఆధారంగా సినిమా దర్శక నిర్మాత సి పుల్లయ్య రూపొందించారు. ఎన్టీ రామారావు, కృష్ణకుమారి జంటగా నటించిన చిత్రంలో అతిథి పాత్రలో యమధర్మరాజుగా ఎస్వీఆర్ ఆకట్టుకున్నారు.

07/25/2016 - 20:53

ఇద్దరుమిత్రులు చిత్రంలో నాయికా నాయకులు ఖుషి ఖుషీగా నవ్వుతూ పాట పాడుతూ చివరిలో ‘హుషారుగా ఉందాములే.. హమేషా మజాగా’ అని ముగిస్తారు.

07/25/2016 - 18:38

శ్రీనగర్‌: నిబంధనలను ఉల్లంఘించి హురియత్‌ కాన్ఫరెన్స్‌ ఛైర్మన్‌, వేర్పాటువాద నేత సయ్యద్‌ అలీ గిలానీ అనంత్‌నాగ్‌కు సోమవారం ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించడంతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. కశ్మీర్‌ లోయలో కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో గిలానీ అక్కడి ప్రజలను పరామర్శించడం కోసం కశ్మీర్‌ లోయలోని అనంతనాగ్‌ జిల్లా ర్యాలీకి పిలుపునిచ్చారు.

07/25/2016 - 18:35

వరంగల్‌: వరంగల్ సోమవారం రైల్వేస్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. వాటర్‌ట్యాంకు పగలడంతో స్టేషన్‌లోకి నీరు వెల్లువెత్తింది. ప్రమాదాన్ని గుర్తించిన అధికారులు స్టేషన్‌ పక్క నుంచి వెళ్తున్న విద్యుత్‌ తీగల్లో కరెంటు సరఫరాను నిలిపివేశారు.

07/25/2016 - 18:34

మెదక్: మల్లన్నసాగర్ నిర్వాసితులకు సంఘీభావంగా జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని, బీజేపీ స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ డిప్యూటీసీఎం దామోదర రాజనర్సింహను అరెస్ట్ చేసి గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్ట్ సమయంలో టీడీపీ, ఇతర పక్షాలకు చెందిన కార్యకర్తలు-పోలీసులకు మధ్య కొద్దిసేపుట తోపులాట జరిగింది.

07/25/2016 - 18:31

మెదక్: మల్లన్నసాగర్ నిర్వాసిత రైతులను కలవనీయకుండా తెరాస సర్కారు ఆంక్షలు విధించడం అన్యాయమని తెలంగాణ జెఎసీ చైర్మన్ కోదండరాం అన్నారు. తనను అరెస్టు చేయడం బాధ కలిగించలేదని, రైతులపై లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. బాధిత రైతులను ఎక్కడికి వెళ్లనీయకుండా గ్రామాల్లో పోలీసులను కాపలా పెట్టడం మంచిది కాదన్నారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి వల్లే మల్లన్నసాగర్ జలాశయంపై రైతులు పోరాటాలకు దిగుతున్నారన్నారు.

07/25/2016 - 18:31

విజయనగరం: తనను ప్రేమించడం లేదన్న కక్షతో ఓ యువకుడు యువతిపై బ్లేడుతో దాడి చేసిన సంఘటన ఇక్కడి గాజులరేగలో సోమవారం జరిగింది. ఎస్.కోటకు చెందిన ఎంబిఎ విద్యార్థి విక్రమ్ కొంతకాలంగా గాజులరేగకు చెందిన యువతి వెంట పడుతున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఇంటికి తన కుటుంబ సభ్యులను పంపాడు. విక్రమ్‌తో పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు సమ్మతించలేదు. దీంతో బ్లేడుతో దాడి చేసేందుకు ఆమె ఇంట్లోకి విక్రమ్ చొరబడ్డాడు.

Pages