S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

మెస్ ఛార్జీల పెంపుపై సత్వర నిర్ణయం తీసుకోవాలి

విజయనగరం(టౌన్), జూలై 22: స్కూల్, కాలేజీ, కాలేజి అటాచ్డ్ హాస్టల్ విద్యార్థుల మెస్‌ఛార్జీల పెంపు విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సత్వర నిర్ణయం తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్ధిసంఘం జిల్లా కార్యదర్శి కె.సురేష్ డిమాండ్ చేశారు. శనివారం నుండి రాజధాని విజయవాడలో సంఘం ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరాహార దీక్షల వాల్ పోస్టర్లను శుక్రవారం సాయంత్రం పట్టణంలోని ఎంఆర్ హాస్టల్‌లో ఆవిష్కరించారు. ఈసందర్భంగా సురేష్ మాట్లాడుతూ నిత్యావసర ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. పెరిగిన ధరలతో పోలిస్తే ప్రభుత్వం విద్యార్థులకు మంజూరు చేస్తున్న మెస్‌ఛార్జీలు ఏ మూలకూ చాలవన్నారు. పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవల్సిన విద్యార్థులకు ప్రభుత్వం ఆ స్థాయిలో మెస్‌ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. స్కూల్, కాలేజీ, అటాచ్డ్ విద్యార్థులకు ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న మెస్‌ఛార్జీలను రెట్టింపు చేయాలని డిమాండ్ చేశారు. కాలేజీ విద్యార్థులకు రెండువేలు, హైస్కూల్ విద్యార్థులకు 1500 రూపాయలు మంజూరు చేయాలని కోరారు. ఇప్పటికే పలు హాస్టళ్లను మూసివేయడం వలన పేద విద్యార్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మూసివేసిన హాస్టళ్లను వెంటనే తెరిపించాలని కోరారు. ఇదేసమయంలో ప్రభుత్వం మొండి వైఖరికి పోకుండా మెస్ ఛార్జీల పెంపులో వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. శనివారంనుండి విజయవాడలో చేపట్టనున్న నిరాహార దీక్షల్లో జిల్లా ఉపాధ్యక్షుడు యు.రాంబాబు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యదర్శి సురేష్, ఉపాధ్యక్షులు రామ్మోహన్, సంతోష్ వెంకటరావు, భాస్కర్, లక్ష్మణరావు పాల్గొన్నారు.