S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 05:54

హైదరాబాద్, జూలై 22: విజయ డెయిరీ సామర్థ్యాన్ని 15లక్షల నుండి 20లక్షల లీటర్లకు పెంచడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర పాడి పరిశ్రమ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో శుక్రవారం విజయ డెయిరీ నూతన ప్యాకింగ్‌లను ఆవిష్కరించారు.

07/23/2016 - 05:53

కొల్లాపూర్, జూలై 22: ఎంజికెఎల్‌ఐ పథకం ద్వారా భూములు కోల్పోయన రైతుల నుంచి మళ్లీ రెండోసారి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కోసం భూములు లాక్కోవడం అన్యాయమని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎంజికెఎల్‌ఐ పథకాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. నార్లాపూర్, ఎల్లూరు, కుడికిళ్ల రైతులతో మాట్లాడారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

07/23/2016 - 05:52

హైదరాబాద్, జూలై 22: హైదరాబాద్‌లో ఓ అకాడమీ సంస్థ బోర్డు తిప్పేసింది. నగరంలోని కర్మన్‌ఘాట్‌లో ఉన్న నాగార్జున అకాడమీ సంస్థ నిర్వాహకులు శుక్రవారం కనిపించకుండా పోయారు. ఆయా పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను తప్పకుండా పాస్ చేస్తామంటూ ఒక్కో విద్యార్థి నుంచి అకాడమీ నిర్వాహకులు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల చొప్పున వసూలు చేశారు.

07/23/2016 - 05:44

విజయవాడ, జూలై 22: పుష్కరాలకు కొద్ది రోజుల ముందే పనులు పూర్తి చేసుకుంటే, అన్నీ సవ్యంగా జరిగి ఉండేవి. పుష్కరాలకు కేవలం ఒక నెల రోజుల ముందు పనులు మొదలుపెట్టడంతో అవి అడ్డదిడ్డంగా జరుగుతున్నాయి. నాణ్యత ఎలాగూ లేదు. కనీసం భద్రత కూడా కరువయ్యే పరిస్థితి నెలకొంది. పుష్కరాల సమయంలో ఘాట్‌లు తడిగా, చిత్తడిగా ఉంటాయి. కాలేస్తే జారిపోయే పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలోపెట్టుకుని ఘాట్‌ల నిర్మాణం చేపట్టాలి.

07/23/2016 - 05:43

విశాఖపట్నం, జూలై 22: నల్లధనం వెలికతీతలో ఆడిటర్లదే కీలకపాత్రని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. రాష్టస్థ్రాయి చార్టడ్ అకౌంటెంట్ల సదస్సు విశాఖలో శుక్రవారం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి యనమల మాట్లాడుతూ నల్లధనం తెల్లధనంగా మారితే దేశంలో ఆర్థిక అసమానతలు తొలగిపోతాయని అన్నారు. ఈ ప్రక్రియ న్యాయబద్ధంగా జరగాలంటే ఆడిటర్లు నిజాయితీగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

07/23/2016 - 05:43

విజయవాడ, జూలై 22: పోలీస్... ప్రజల భాగస్వామ్యంతో పోలీస్ వ్యవస్థను పటిష్ఠం చేయాలన్నది తన అభిమతమని, అలాగే సమాజంలో పోలీస్ ఇమేజ్ పెంపుకోసం పోలీస్ స్టేషన్ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అన్ని స్థాయిల్లోనూ దశలవారీగా సంస్కరణలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఇన్‌ఛార్జి డిజిపిగా శనివారం బాధ్యతలు స్వీకరించనున్న నండూరి సాంబశివరావు అన్నారు.

07/23/2016 - 05:42

విజయవాడ, జూలై 22: గడిచిన రెండేళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చాయని రాష్ట్ర డిజిపి జాస్తి వెంకట రాముడు తెలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపడంతోపాటు కేంద్ర ద్వారా చట్ట సంస్కరణ తీసుకువచ్చి కఠిన నిర్ణయాలు అమలు చేస్తున్నామన్నారు. గత రెండేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న పోలీసుశాఖ ఖాళీ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చిందని చెప్పారు.

07/23/2016 - 05:41

పోలవరం, జూలై 22: రాష్ట్రానికే ప్రతిష్ఠాత్మకంగా భాసిల్లే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. మూడు నెలలుగా జీతాలు చెల్లించడంలేదంటూ కార్మికులు సమ్మెకు దిగడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శుక్రవారం నుండి నిలిచిపోయాయి.

07/23/2016 - 05:40

గుంటూరు, జూలై 22: రాజధాని ప్రాంతంలో మరోసారి భూ సేక..రణం మొదలైంది.. ఇటీవల వరకు సీఆర్డీయే అధికారులు రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో సామాజిక సర్వేని పూర్తిచేశారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం సర్వే, గ్రామసభలు నిర్వహించి ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ చట్టం ప్రకారమే నష్టపరిహారం చెల్లిస్తామని, భూ సమీకరణకు ఇచ్చిన ప్యాకేజీ సేకరణ జరిపే రైతులకు వర్తించదని ముఖ్యమంత్రి ఓ సందర్భంలో స్పష్టం చేశారు.

07/23/2016 - 05:39

విజయవాడ, జూలై 22: రాష్ట్రంలో ఐదుగురు ఐఎఎస్‌లు బదిలీ అయ్యారు. విశాఖ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎన్ యువరాజ్‌ను బదిలీ చేశారు. ఆయనను జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ (జిఎడి)కి రిపోర్ట్ చేయమన్నారు. యువరాజ్ సెంట్రల్ సర్వీసెస్‌కు వెళ్లనున్నారు. యువరాజ్ స్థానంలో గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌ను నియమించారు.

Pages