S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 07:03

హైదరాబాద్, జూలై 22: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు జి. పద్మజారెడ్డి, ప్రధాన కార్యదర్శులు కె. రవళి, జి. ఉమారాణి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును డిమాండ్ చేశారు.

07/23/2016 - 07:02

హైదరాబాద్, జూలై 22: వ్యాపమ్‌ను తలదనే్నలా ఎంసెట్-2 కుంభకోణం జరిగిందని, దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని టి.పిసిసి అధికార ప్రతినిధి కొనగాలి మహేశ్ డిమాండ్ చేశారు. ఎంసెట్-2 ప్రశ్నా పత్రం లీకేజీలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రమేయం ఉందని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఆరోపించారు.

07/23/2016 - 07:02

హైదరాబాద్, జూలై 22: రైతుల నుంచి ఏకపక్షంగా, బలవంతంగా భూములు సేకరించరాదని తెలంగాణ రెవెన్యూ అధికారులను శుక్రవారం హైకోర్టు హెచ్చరించింది. రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించడం ద్వారా వారిని ఆత్మహత్యలకు ప్రేరేపించినట్లవుతుందని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒక రైతు ఆత్మహత్య చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులకు రూ. 6 లక్షల సొమ్ము చెల్లించడం వల్ల ప్రయోజనం లేదని పేర్కొంది.

07/23/2016 - 07:01

మహబూబ్‌నగర్, జూలై 22: కృష్ణానది వరద ఒక్కసారిగా పెరిగింది. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో కృష్ణానదికి మళ్లీ జలకళ వచ్చింది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా వస్తున్న వరదతో జూరాల ప్రాజెక్టుకు వరద పెరిగి నిండుకుం డలా మారింది.

07/23/2016 - 07:00

హైదరాబాద్, జూలై 22: కేంద్రం నుంచి తగినంత సహాయం రాకపోయినా, సంక్షేమం కోసం వేల కోట్లు వెచ్చిస్తు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, దానికి తగిన ప్రచారం రావడం లేదని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

07/23/2016 - 06:59

హైదరాబాద్, జూలై 22: కవి డాక్టర్ దశరథి పద్యాల్లోని ప్రతి అక్షరం ఓ నిప్పురవ్వ అని అభివర్ణించారు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ. దాశరథి కృష్ణమాచార్య 92వ జయంతి ఉత్సవం శుక్రవారం ఉదయం రవీంద్రభారతిలో జరిగింది. తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మహమూద్ అలీ మాట్లాడుతూ నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అంటూ గొంతెత్తిచాటిన మహానీయుడు దాశరథి అని గుర్తుచేశారు.

07/23/2016 - 06:46

న్యూఢిల్లీ,జూలై 22: ఎన్‌డిఏ ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ సభ్యుడు కె.వి.పి.రామచందర్‌రావుప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఓటింగ్ జరగకుండా అడ్డుకుంది. బిజెపి, అకాలీదళ్ సభ్యులు శుక్రవారం చేసిన గొడవ మూలంగా ప్రత్యేక హోదా బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరగలేదు.

07/23/2016 - 06:39

హైదరాబాద్, జూలై 22: హరితహారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఏ మేరకు భాగస్వాములు అయ్యారో తెలుసుకునేందుకు సోమవారం నుంచి ఆకస్మిక తనిఖీలు జరుపుతానని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుస్పష్టం చేశారు.

07/23/2016 - 06:36

హైదరాబాద్, జూలై 22: ఒకప్పుడు మావోయిస్టులకు షెల్టర్ ఇచ్చిన ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం ఉగ్రవాద సానుభూతిపరులకు అడ్డాగా మారుతోందని పోలీస్ ఉన్నతాధికారులు పసిగట్టారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు మధ్య ఉన్న మంచిర్యాలలో ఐసిస్ ఉగ్రవాద సానుభూతిపరులు ఆశ్రయం పొందుతూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఇటీవల ఘటనలు రూఢీ చేస్తున్నాయి.

07/23/2016 - 06:31

హైదరాబాద్, జూలై 22: గురుకుల విద్యాలయాల్లో బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి ఆగస్టు మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఇప్పటి వరకు తమకు వివిధ విద్యాలయాల నుంచి అందిన సమాచారం మేరకు 2,444 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు శుక్రవారం ఆయన మీడియాకు వెల్లడించారు.

Pages