S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/23/2016 - 11:34

ఢిల్లీ: ఆఫ్గనిస్థాన్‌లోని కాబూల్‌లో గత నెలలో అపహరణకు గురైన భారతీయ మహిళ జుడిత్ డిసౌజాను కాపాడారు. ఆమె సురక్షితంగా ఉన్నట్టు కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. 40 ఏళ్ల జుడిత్ అంతర్జాతీయ ఎన్జీవో ఆఘా ఖాన్ పౌండేషన్‌లో సీనియర్ టెక్నికల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. జూన్ 9న ఆమెను కార్యాలయం బయట అనుమానిత ఉగ్రవాదులు అపహరించుకుపోయారు. అప్పటినుంచి ఆమెను కాపాడడానికి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.

07/23/2016 - 11:32

మహబూబ్‌నగర్ : వరద ప్రభావం తగ్గడంతో జూరాల ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. విద్యుత్ ఉత్పత్తి కూడా రెండు యూనిట్లకు పరిమితం చేశారు. ప్రస్తుతం 32వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 20430 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదు అవుతోంది.గత రాత్రి భీమానది నుంచి వస్తున్న వరద ఒక్కసారిగా 20వేల క్యూసెక్కుల నుంచి 60వేల క్యూసెక్కులకు పెరిగిపోయింది. దీంతో ప్రాజెక్టు ఏడు గేట్లు మీటర్ మేర ఎత్తి దిగువకు నీటిని వదిలారు.

07/23/2016 - 07:27

న్యూఢిల్లీ, జూలై 22: పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్), ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ (టాన్)లను ఇక ఒక్కరోజులోనే సంస్థలు పొందవచ్చు. అవసరమున్న సంస్థలు డిజిటల్ సిగ్నేచర్ సర్ట్ఫికెట్ ఆధారిత దరఖాస్తును సమర్పిస్తే చాలు.. 24 గంటల్లోనే పాన్, టాన్ రిజిస్ట్రేషన్ అందుతుంది. వ్యాపార నిర్వహణ సులభతరం చేయడంలో భాగంగానే ఈ సంస్థాగత మార్పు అని ఆదాయ పన్ను శాఖ శుక్రవారం తెలిపింది.

07/23/2016 - 07:23

హైదరాబాద్, జూలై 22: ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్‌కు ఫ్రాంచైజీ టీమ్ హైదరాబాద్ హంటర్స్ శుక్రవారం ఇక్కడ రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఆటగాళ్ల బృందానికి వీడ్కోలు సమావేశం నిర్వహించింది. ఈ వేడుకలకు క్రీడాకారులు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, శ్రీకాంత్ కిడాంబీ, అశ్వినీ పొన్నప్ప, పీవి సింధూ, మనుఅత్రి, బి సుమీత్ రెడ్డి, అథ్లెట్ ద్యుతిచాంద్, ఇండియన్ బాడ్మింటన్ టీమ్ కోచ్ పుల్లెల గోపిచంద్ పాల్గొన్నారు.

07/23/2016 - 07:15

గోరఖ్‌పూర్, జూలై 22: దేశాన్ని ఆధునికం, సౌభాగ్యవంతం చేయడంలో స్వామీజీలు, వివిధ మతాలకు చెందిన మఠాలు కీలకపాత్ర పోషించాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయ పడ్డారు. అంతేకాదు వీరిలో చాలా మంది ఇప్పటికే టాయిలెట్లు నిర్మించడం, వైద్య సేవలు అందించడం లాంటి అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నాయని కూడా ఆయన అన్నారు.

07/23/2016 - 07:08

హైదరాబాద్, జులై 22: ఎంసెట్-2 పేపర్ లీకేజి దోషులను కఠినంగా శిక్షించాలని ఎబివిపి నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని ఉన్నత విద్యా మండలి ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎం. రాఘవేందర్, నగర కార్యదర్శి జె. దిలీప్, జోనల్ ఇన్‌ఛార్జీలు సురేష్, చైతన్య, శ్రీహరి, శ్రీశైలం, జీవన్, శ్రీరామ్ ప్రభృతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

07/23/2016 - 07:07

విజయవాడ, జూలై 22: రాష్టవ్య్రాప్తంగా సంచలనం కలిగించిన విజయవాడ స్వర్ణ బార్ మద్యం మరణాల కేసులో ఫోరెన్సిక్ నివేదిక బహిర్గతమైంది. బార్‌లో మద్యం సేవించి పలువురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కాగా.. మద్యం శాంపిల్స్‌ను పరీక్షించిన ఫోరెన్సిక్ ల్యాబ్ మద్యంలో సైనెడ్, ఇథైల్ ఆల్కాహాల్ కలిసినట్లు నిర్థారించింది.

07/23/2016 - 07:06

హైదరాబాద్, జూలై 22: రాజకీయ పార్టీలకు ప్రభుత్వ భూములను రాజధాని అమరావతితో పాటు జిల్లా కేంద్రాల్లో ఇవ్వాలన్న చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వైకాపా తీవ్రంగా వ్యతిరేకించింది. వెంటనే ఈ ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అసెంబ్లీలోరాజకీయ పార్టీలకు సీట్లను బట్టి భూములు, స్ధలాన్ని కేటాయించాలన్న ప్రభుత్వం నిర్ణయం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు.

07/23/2016 - 07:05

హైదరాబాద్, జూలై 22: తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞం ఫలాలనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా ప్రారంభోత్సవాలు చేస్తున్నదని ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీశ్ రావు ప్రారంభించేందుకు వెళ్ళారని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఉదహరించారు.

07/23/2016 - 07:05

హైదరాబాద్, జూలై 22: గృహ నిర్మాణ జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లో చాలా కాలం నుంచి అపరిషృతంగా ఉన్న సమస్యలను పరిష్కారం చూపాలని శుక్రవారం క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. వివిధ కారణాల వల్ల ఆగిపోయిన జాయింట్ వెంచర్ ప్రాజెక్టుల్లోని ప్లాట్లు, విల్లాల రిజిస్ట్రేషన్ పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉప సంఘం అధికారులను ఆదేశించింది.

Pages