S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

కోలుకుంటున్న విద్యార్థులు

ఆకివీడు, జూలై 22: వింత వ్యాధితో బాధపడుతున్న ఆకివీడు మండలం చినకాపవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులు ప్రస్తుతం కోలుకుంటున్నారు. గత పది రోజులుగా పాఠశాలకు వచ్చిన విద్యార్ధిని విద్యార్ధులు వింత వ్యాధికి గురై కళ్లు తిరిగి పడిపోతున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి సోమవారం వరకు పాఠశాలకు సెలవులు ప్రకటించారు. శుక్రవారం పెదకాపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రవికిరణ్ రెడ్డి, ఎఎన్‌ఎంలు వైద్య సిబ్బంది విద్యార్థుల ఇళ్లకువెళ్లి సర్వే నిర్వహించారు. . వరుస సెలవులు ఇవ్వడంతో వాతావరణం మారితే మంచిదని కొందరు తల్లిదండ్రులు పిల్లలను బంధువుల ఇళ్లకు పంపించారు. ఇళ్లవద్ద ఉన్న విద్యార్థుల పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. తహసీల్దార్ నాగార్జునరెడ్డి ఉపాధ్యాయుల నుంచి విద్యార్ధులు పడిపోతున్న తీరుతెన్నుల గురించి సమగ్ర సమాచారాన్ని సేకరించారు. ఇదిలావుండగా మండల బిజెపి నాయకులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.