S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నంద్యాలకు మహర్దశ!

నంద్యాల, జూలై 22: నంద్యాల జిల్లా అవుతుందన్న ఈ ప్రాంత ప్రజల కలలు త్వరలో సాకారం కానున్నాయన్న వార్తలు వస్తుండడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మంత్రి పివి నరసింహారావు నంద్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సమయంలోనే నంద్యాలను జిల్లా చేయాలని ప్రజల నుండి డిమాండు వచ్చినప్పటికి కర్నూలు ప్రాంతానికి చెందిన నేతలు నంద్యాల జిల్లా అయితే తమ ప్రాధాన్యత తగ్గిపోతుందన్న ఆలోచనతో జిల్లా కాకుండ పూర్తిస్థాయిలో అడ్డుపడిన సంగతి ఈ ప్రాంత ప్రజలకు తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన రెండు సంవత్సరాలకు అటు తెలంగాణలోను, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోను జిల్లాల పునర్విభజన చర్చ జోరుగా జరిగింది. ఇప్పుడున్న 13 జిల్లాలకు మరో 10 లేదా 12 జిల్లాలు చేయాలన్న ఆలోచన రాష్ట్ర పాలకులకు రావడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా 2019 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజనతోపాటు జిల్లాల పునర్విభజన కూడా పూర్తికావచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం సఖ్యతగా ఉండడం వల్ల నంద్యాల జిల్లా కావడం ఖాయంగా కనిపిస్తుంది. నంద్యాల ప్రాంతానికి జిల్లా కాగల అర్హతలన్ని ఉన్నాయి. నంద్యాల ప్రాంతానికి తూర్పువైపున శ్రీశైలం నుండి చాగలమర్రి వరకు నల్లమల అడవులు రక్షణ కవచంలా ఉండడంతో పాటు వర్షాలకు ఈ ప్రాంతం ఆలవాలంగా మారింది. దీనికి తోడు నంద్యాల ప్రాంతం జిల్లాలోనే సాగునీటి సౌకర్యాలు పుష్కలంగా ఉన్న సారవంతమైన నేలలు కలిగి మంచి పంటలు పండుతున్నాయి. రైస్ బౌల్ ఆఫ్ రాయలసీమగా ఖ్యాతి చెందిన నంద్యాల ప్రాంతం కోస్తా ప్రాంతానికి వ్యవసాయంలో పోటీపడుతుంది. ఇదేకాక నంద్యాల ప్రాంతం విద్యారంగంలో కూడా కర్నూలుకు తీసిపోదు. ఈ ప్రాంతంలో మెడికల్, అగ్రికల్చర్, ఇంజనీరింగ్ కళాశాలలతోపాటు పిజి, డిగ్రీ, ఇతర ప్రైవేటు కళాశాలలకు తోడు దక్షణ భారతదేశంలోనే పేరున్న బ్యాంకు కోచింగ్ కేంద్రం కూడా నంద్యాలలో ఉండడం విశేషం. ఇదేకాక నంద్యాల ప్రాంతం పారిశ్రామికంగా జిల్లాలోని ఇతర ప్రాంతాలను మించిపోయింది. నంద్యాల డివిజన్‌లో సిమెంటు పరిశ్రమలు వరుస కడుతున్నాయి. ఇప్పటికే ఆగ్రో పరిశ్రమ ఉత్పత్తి దశలో ఉండగా, తంగెడంచలో అంబుజా వారి ఆగ్రో పరిశ్రమ కూడా త్వరలో ప్రారంభం కానుంది. నంద్యాల సమీపంలోని కొండజూటూరు వద్ద నానో కెమికల్ పరిశ్రమ కూడా త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కల సోలార్ విద్యుత్ పరిశ్రమ కూడా త్వరలో ప్రారంభమవుతుంది. అటు పరిశ్రమ రంగం, ఇటు వ్యవసాయ రంగం, విద్యారంగం మూడు పువ్వులు, ఆరు కాయలుగా అభివృద్ధి చెందడానికి కావాల్సిన రవాణా సదుపాయం కూడా నంద్యాలకు చేకూరింది. ఇటీవలే ఎర్రగుండ్ల రైల్వే లైన్ పూర్తికావడంతో నంద్యాల నుండి హౌరా వరకు, ఇటు గోవా, ముంబాయి వరకు, రాజధాని అమరావతి, తెలంగాణ రాజధాని హైదరాబాదుతోపాటు తిరుపతి, చెన్నైలకు రైలు మార్గం ఉండడంతో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే నంద్యాల మీదుగా కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారి నిర్మాణ పనులు చివరి దశకు రాగా, అనంతపురం నుండి రాజధాని అమరావతికి కలిపే ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణ పనులు కూడా త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజుల క్రితం అనంతపురం నుండి అమరావతి రాజధానికి నిర్మించే జాతీయ రహదారి పనుల కోసం రూ.12 కోట్ల ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్‌ను నియమించిన విషయం కూడా తెలిసిందే. కన్సల్టెంట్ సూచనల మేరకు జాతీయ రహదారి డిపిఆర్‌ను సిద్ధం చేస్తారని జాతీయ రహధారి ఉన్నతాధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు - గుంతకల్లు రైలుమార్గంలో విద్యుద్దీకరణ పనులు 90 శాతం మేరా పూర్తికాగా, అక్టోబర్ నెల నుండి ఈ మార్గంలో విద్యుత్ రైళ్లు నడిచే అవకాశం ఉంది. రైల్వే శాఖ మంత్రి ఎపి కోటా ద్వారా రాజ్యసభ సభ్యుడు అయిన వెంటనే రైల్వే బోర్డు ఉన్నతాధికారులతో విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో జరిపిన అత్యున్నత స్థాయి సమావేశంలో గుంటూరు - గుంతకల్లు మార్గాన్ని డబ్లింగ్ చేసేందుకు 50 శాతం కేంద్ర నిధులు, 50 శాతం రాష్ట్ర నిధులతో స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. విద్యుద్దీకరణ పూర్తి కాగానే డబ్లింగ్ పనులకు సర్వే ప్రారంభిస్తారని రైల్వే ఉన్నతాధికారులు అంటున్నారు. నంద్యాల జిల్లాగా ప్రకటిస్తే మరింత అభివృద్ధి సాధించి రాయలసీమలో ప్రధాన నగరంగా అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.