S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

బడ్జెట్‌లో 10 శాతం వ్యవసాయానికి కేటాయించాలి

కర్నూలు సిటీ, జూలై 22 : రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి 10శాతం కేటాయించాలని అఖిల భారత కిసాన్ సభ రాష్ట్ర అధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఏపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్ అధ్యక్షతన శుక్రవారం నగరంలోని కెకె భవన్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలకు కలిపి మొత్తం రూ. 1.35 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందన్నారు. అయితే అందు లో వ్యవసాయ రంగానికి కేవలం రూ. 6వేల కోట్లు కేటాయించి, అందులో రూ. 4,200 కోట్లు రుణమాఫీకి జమ చేయగా ఇక మిగిలింది కేవలం రూ. 1800 కోట్లు మాత్రమే అన్నారు. రాజధాని నిర్మా ణం, దేవాలయాలు, రహదారులకు ఎక్కువ శాతం బడ్జెట్ కేటాయించి దుబారా చేస్తూ దేశానికే అన్నం పెట్టే వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తుందన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత వ్యవసాయం పూర్తిగా అధ్వాన్నస్థితిలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గతంలోకి ప్రస్తుతానికి పోలిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగా తగ్గిందన్నారు. అలాగే ప్రతి యేటా 66లక్షల హెక్టార్లలో రైతులు వరి పంట సాగు చేసే వారని, ప్రస్తుతం 40 లక్షల హెక్లార్లలో మాత్రమే సాగు చేస్తున్నారని వెల్లడించారు. పట్టిసీమ ద్వారా కృష్ణ బేసిన్‌కు నీరు విడుదల చేస్తామని గొప్పలు చెప్పి కేవలం 8 టిఎంసిల నీటిని మాత్రమే విడుదల చేశారన్నారు. జిల్లాలో ఎస్‌ఆర్‌బిసి, తెలుగుగంగ, కెసి కెనాల్, తుంగభద్ర ఎల్‌ఎల్‌సిలకు గత రెండేళ్లుగా నీళ్లు లేకపోవడంతో పంటలు సాగు చేయలేదన్నారు. వాతావరణ శాఖ అధికారులు ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని ప్రకటించినా ఇప్పటి వరకూ రాష్ట్రంలో 167 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైందన్నారు. గత ఏడాది రాష్ట్రంలో తీవ్ర వర్షాబావ పరిస్థితులు నెలకొనటంతో రాష్ట్ర వ్యాప్తంగా 380, జిల్లాలో 40 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించారన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవటానికి రూ. 860 కోట్లను రాష్ట్రానికి విడుదల చేసిందని, వాటిలో 14వ ఆర్థిక సంఘం కింద రూ. 440కోట్లు, ప్రత్యేక ప్యాకేజీ కింద రూ. 420కోట్లు పంపితే అందులో ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా రైతులకు నష్ట పరిహారం పంపిణీ చేయలేదన్నారు. ఆ నష్ట పరిహారంలో కొంత అయినా రైతులకు పంపిణీ చేసి ఉంటే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయటానికి ఉపయోగపడేదని, కానీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్పత్తి రంగానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడంతో పప్పు్ధన్యాలను మలేషియా, సింగపూర్ నుంచి, వంట నూనెలను మయన్మార్ నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యత ఇవ్వకపోవడంతో రైతులు ఇతర రంగాలకు మారుతున్నారని, దీంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందన్నారు. విదేశాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే రాష్ట్రం ప్రస్తుతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన దిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తుందో అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా మేల్కొని వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో 10శాతం కేటాయిస్తే రాబోయే తరాలకు ఆహార కొరత లేకుండా కొంతమేరకైనా కాపాడుకోవచ్చని, ప్రభుత్వం ఆ దిశగా పయనించాలని సూచించారు. సమావేశంలో ఏపి రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణ పాల్గొన్నారు.