S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

నంద్యాల సివిల్ సప్లై కార్యాలయం తనిఖీ

నంద్యాల రూరల్, జూలై 22: నంద్యాల తహశీల్దార్ కార్యాలయంలోని సివిల్ సప్లై కార్యాలయ విభాగాన్ని శుక్రవారం జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల బృందం రామకృష్ణరావు, శ్రీనివాసరెడ్డిలు తనిఖీ చేశారు. శుక్రవారం సివిల్ సప్లై కార్యాలయ విభాగంలో కంప్యూటర్‌లో నమోదైన ప్రభు త్వ చౌకా దుకాణాల జాబితా, నిత్యావసర సరుకుల పంపిణీ, బయోమెట్రిక్ మిషన్ ద్వారా రేషన్ సరఫరా తదితర వాటిని ఆన్‌లైన్ ద్వారా తెలుసుకున్నారు. సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ జనార్ధన్‌శెట్టిని రేషన్ డీలర్లను పిలిపించాలంటూ ఆదేశించారు. కొంత మంది రేషన్ డీలర్లను కార్యాలయానికి పిలిపించి బయోమెట్రిక్ మిషన్ ద్వారా పంపిణీ చేస్తున్నారా లేదా అని, సరకులు సక్రమంగా అందుతున్నాయా లేదని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. డీలర్లు లబ్ధిదారులకు సరుకులు సక్రమంగా అందజేలాయని ఆదేశించారు. అనంతరం కంప్యూటర్‌లో ఉన్న జాబితాను పరిశీలించి రికార్డులను తనిఖీ చేసి నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. వీరి వెంట ఎఫ్‌ఐ విజయశేఖర్, ఆర్‌ఐ శివప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.