S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుష్కరాల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి

పాములపాడు, జూలై 22:కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మెరు గైన సౌకర్యాలు కల్పించాలని కృష్ణా పుష్కరాల ప్రత్యేకాధికారి జి.అనంతరాము ఆదేశించారు. ఆయన శుక్రవా రం సాయంత్రం కలెక్టర్ విజయమోహన్‌తో కలిసి సంగమేశ్వరం క్షేత్రంలో జరుగుతున్న పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పార్కింగ్ ప్రదేశాన్ని పరిశీలిస్తూ దాదాపు 20 నుంచి 30వేల మందికి సరిపడే విధంగా తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. నూతనంగా నిర్మిస్తున్న స్నానపు ఘట్టాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. 300 క్యూబిక్ మీటర్ల పనులు పెండింగులో ఉన్నాయని, వాటిని 5 రోజుల్లో పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మిగిలిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ఇరిగేషన్ ఎస్‌ఇ ప్రత్యేకాధికారికి నివేదించారు. ఆ తర్వాత ఆర్‌అండ్‌బి, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ శాఖల తరఫున చేస్తున్న నిర్మాణ పనులను ఆయన మ్యాప్ ద్వారా పరిశీలించి పలు సూచనలు చేశారు. పుష్కర ఘాట్ పెండాల్స్ వేసే స్థలం చుట్టూ వర్షం నీరు వెళ్లేందుకు క్రెంచ్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే శ్రీశైలం జలాశయంలో 835 అడుగుల నీరు వస్తే 3 ఘాట్‌లలో భక్తులు స్నానం చేసేందు కు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకాధికారి అనంతరాముకు సప్తనదీ సంగమేశ్వరం ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం ఆయన వేపదారు లింగానికి పూజలు నిర్వహించి పూజారుల ఆశీర్వాదం పొందారు. ఆయన వెంట ఏఎస్పీ చం ద్రశేఖర్‌రెడ్డి, డిపిఓ ఆనంద్, కర్నూలు ఆర్‌డిఓ రఘుబాబు ఉన్నారు.