S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివారం

పుష్కరాల్లో భక్తులకు ఇబ్బంది కలుగకూడదు

కర్నూలు, జూలై 22:కృష్ణా పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆధ్యాత్మిక భావనతో సంతృప్తి చెందిన మనసుతో తిరిగి వెళ్లాలని, ఆ దిశగా వసతులు, భద్రత కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పుష్కరాల ప్రత్యేకాధికారి జి.అనంతరాము అధికారులను ఆదేశించారు. కృష్ణా పుష్కరాలపై శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా వివిధ శాఖల ద్వారా చేపడుతున్న పనులన్నీ ఈ నెల 31వ తేదీ లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పనిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, రాజీ పడవద్దని సూచించారు. స్నానపు ఘట్టాలు, పార్కింగ్ ప్రదేశాలు, ఫుడ్‌కోర్టులు, వసతి ప్రదేశాలు తదితర ప్రాంతాల్లో శాఖల వారీగా కేటాయించిన విధులు, అధికారుల వివరాలతో కూడిని కార్యాచరణ ప్రణాళికను తనకు అందించాలన్నారు. పుష్కర ఘాట్ల వివరాలు, పుష్కర నగర్, వాహనాల పార్కింగ్ ఏయే ప్రాంతాల్లో ఏర్పా టు చేశారో తదితర వివరాలు పొందుపరుస్తూ సూచిక బోర్డులను ముఖ్యకూడళ్లలో ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సమాచారం కోసం కరపత్రాలు ము ద్రించి పంపిణీ చేయాలన్నారు. ఆల్ ఇండియా రేడియో అధికారులతో సంప్రదించి అనౌన్స్‌మెంట్ ఇప్పించాలన్నారు. వైద్య సంబంధిత సౌకర్యాలు, వైద్యు లు, ఆసుపత్రులు, మందుల లభ్యత, ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేశారో బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు రాత్రువేళల్లో ఇబ్బందులకు గురికాకుండా నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. పుష్కర నగర్, వాహనాల పార్కింగ్, భక్తుల వసతి గృహాల వద్ద తాగునీటికి ఎటువంటి సమ స్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల రాకపోకలు సజావుగా సాగడంలో ప్రధానంగా రోడ్లు ముఖ్యపాత్ర వహిస్తాయని, వాటిపై దృష్టి కేంద్రీకరించి నాణ్యతగా పనులు చేపట్టాలన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం మెరుగుకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్రాల్లో మొత్తం 7 ప్రాంతాల్లో స్నానఘట్టాలు ఏర్పాటు చేస్తున్నామని, అన్ని ప్రాంతాల్లో పుష్కర పనులు పురోగతిలో వున్నాయన్నారు. సంగమేశ్వరంలో కిందిస్థాయిలో ఒకటి కాగా గతంలో ఉన్నదే మరమ్మతులు చేస్తున్నామని, పై ప్రాంతాల్లో రెండు స్నాన ఘట్టాలు ఒకటి గతంలో వున్నది రెండవది కొత్తగా నిర్మిస్తున్నామన్నారు. లింగాలగట్టులో కింద స్థాయిలో ఒకటి పై ప్రాంతంలో ఒకటి రెండు కొత్తగా నిర్మిస్తున్నామన్నారు. పాతాళగంగ వద్ద ఒకటి గతంలో ఉన్నదే పునరుద్ధరిస్తున్నామని, రెండవది కొత్తగా నిర్మిస్తున్నామన్నారు. పుష్కర ఘాట్లకు వెళ్లే అన్ని ప్రాంతాల్లో రోడ్లను బలోపేతం చేస్తున్నామన్నారు. మెషిన్లను, మెస్‌ను అదనంగా ఏర్పాటు చేసి పనులను పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆగస్టు 8 నుంచి 24వ తేదీ వరకూ 24 గంటలూ 3షిఫ్టుల్లో విధులు నిర్వర్తించేందుకు ప్రత్యేక అధికారులు, ఇన్‌చార్జి అధికారులను నియమించామని తెలిపారు. సంగమేశ్వరంలో లలితాదేవి కళా వేదిక ఏర్పాటు చేసి ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సంస్కాృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సంగమేశ్వరం నుంచి శ్రీశైలం వెళ్లేందుకు పర్యాటకశాఖ ఆధ్వర్యంలో బోట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. శివరాత్రి పర్వదినాల్లో చేసిన విధంగా భక్తులకు అసౌకర్యం కలుగకుండా పారిశుద్ధ్యం మెరుగుకు, వైద్య సహాయార్థం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఘాట్ రోడ్డులో వాహనాల రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. కమ్యునికేషన్ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల నుంచి స్పందన తీసుకుని వాటిని పరిశీలించి పరిగణలోకి తీసుకుని తదుపరి సమస్యలను పరిష్కరించి మెరుగైన సేవలందించుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సమావేశంలో జెసిలు హరికిరణ్, రామస్వామి, ఏఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీశైలం దేవస్థానం ఎగ్జిక్యూటివ్ అధికారి నారాయణభరత్‌కుమార్‌గుప్తా, డిఆర్‌ఓ గంగాధర్‌గౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.