S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/09/2017 - 19:47

తెలుగులో తొలి రంగుల చిత్రం ‘లవకుశ’ (1963). 1956లోనే ఈ చిత్రం తాలూకు చిత్రీకరణ ప్రారంభమైంది. ఎనిమిది వేల అడుగుల ఎడిటెడ్ చిత్రం తయారుకాగానే ఆర్థిక పరిస్థితుల కారణంగా నాలుగేళ్ల నిర్మాణం ఆగిపోగా, డిస్ట్రిబ్యూషన్ సుందర్‌లాల్ నహతా చొరవవల్ల తిరిగి చిత్ర నిర్మాణం ప్రారంభమైంది.

10/09/2017 - 19:44

ఈ చిత్రంలో మహాశివుడి పాత్రలో చిరంజీవిని చూడండి. ఆ పాత్రలో చిరంజీవి చూడముచ్చటగా వున్నారు కదూ. అలా చిరంజీవి శివుడి పాత్రలలో రెండు చిత్రాలలో నటించి మెప్పించారు. ముఖ్యంగా శ్రీమంజునాథ చిత్రంలో ప్రధాన పాత్రగా కనపడి మరింత ఆకర్షించగలిగారు. చిరంజీవికి నటనలో శిక్షణ పొందినా, నృత్యాలలో కూడా మంచి ప్రావీణ్యత వుండటం వలన శివతాండవం దృశ్యాలలో మరింత రాణించగలిగారు.

10/02/2017 - 21:45

అభిమానుల ప్రేమాభిమానాలతోనే కోలీవుడ్‌లో తిరుగులేని కథానాయికగా అగ్ర స్థానానికి చేరుకున్నానంటోంది అందాల భామ హన్సిక. ఈ బ్యూటీకి తమిళనాట మంచి ఇమేజ్ ఏర్పడింది. టాలీవుడ్‌లో ‘దేశముదురు’తో కవ్వించిన హన్సికకు తెలుగునాట కాలం కలిసిరాలేదు. ఎన్నో ఆశలతో తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినా కెరీర్‌లో ఎదగలేకపోయింది. బరువు పెరిగి ఆ తర్వాత క్రమేణా టాలీవుడ్‌కు దూరమైంది.

10/02/2017 - 21:43

రాశీఖాన్నా రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో స్పెషల్ పాటలో నటించిందట. ఇప్పుడు హీరోయిన్లందరూ ఐటెమ్ పాటా, హీరోయిన్ పాత్రా అనే విషయాన్ని చూడడంలేదు. రెమ్యూనరేషన్‌ను బట్టి సినిమాలో నటించేస్తున్నారు. పాత్రేదైనా ఫర్వాలేదంటున్నారు. కానీ రాశీఖన్నా మాత్రం పారితోషికం లేకుండా ఐటెం పాటలో చిందులేసిందట. ఎందుకలా?

10/02/2017 - 21:42

కెరీర్ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న సమయంలో నిర్మాతలు కేసులు పెట్టడం, బయటనుండి వివాదాలు రావడం హీరోయిన్లకు అశనిపాతంలాంటిది. అలాంటి సంఘటన లావణ్య త్రిపాఠి విషయంలో జరిగింది. సోగ్గాడే చిన్నినాయన, భలే భలే మగాడివోయ్ చిత్రాలతో హిట్ బాట పట్టిన ఈ అందాల రాక్షసికి కోర్టు కష్టాలు ఎదురవుతున్నాయి. వివరాల్లోకి వెళితే, హండ్రెడ్ పర్సెంట్ లవ్ చిత్రాన్ని తమిళంలో హండ్రెడ్ పర్సెంట్ కాదల్ పేరుతో రీమేక్ చేస్తున్నారు.

10/02/2017 - 21:32

ఈ చిత్రంలో మీరు చూస్తున్న మహానటుల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదనుకుంటాను. ప్రారంభ చిత్రం ప్రతిజ్ఞ(1953) నుంచి విడివిడిగా వీరిద్దరు నటించిన చిత్రాలు కాకుండా వీరిద్దరు కలసి నటించిన చిత్రాల సంఖ్య 33. సాధారణంగా ఏ నటులైనా వారికి లభించిన పాత్రల దృష్ట్యా ఒక్కొక్క చిత్రానికి ఒక్కొక్క రకమైన వావివరుసలతో వుంటుంది.

10/02/2017 - 21:29

అక్కినేని నాగేశ్వరరావు ‘నభూతో నభవిష్యతి’ అనిపించే విధంగా నటించన చిత్రం ‘దేవదాసు’ (1953). బెంగాలీలో శరశ్చంద్ర ఛటర్జీ 1901లో దేవదాసు నవలను రాస్తే 1917లో పుస్తకంగా వెలువడింది. ఇన్నిసార్లు ఇన్ని భాషల్లో సినిమాగా నిర్మించిన నవల మరొకటి కనిపించదు. దేవదాసు నవలను 1928లో మొట్టమొదటిసారిగా బెంగాలీలో మూకీ చిత్రంగా నిర్మించారు.

10/02/2017 - 21:26

దర్శకుడు కమలాకర కామేశ్వరరావు పేరు వినగానే ఆయన రూపొందించిన పౌరాణిక చిత్రాలు మన స్మృతిపథంలో మెదులుతాయి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు పాతికపైగా పౌరాణిక చిత్రాలను రూపొందించారు ఆయన. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో పౌరాణిక, చారిత్రాత్మక, జానపద, సాంఘిక చిత్రాలు రూపొందినా ఆయనకు పేరు సంపాదించి పెట్టినవి పురాణగాథల ఆధారంగా రూపొందిన చిత్రాలే ఎక్కువ.

10/02/2017 - 21:09

భాష ప్రకృతిలో ధ్వనించే శబ్దాలనుండి పురుడు పోసుకుంటుంది. ఆ శబ్దాల పలుకులలో నుండే భూమిపై ఆవిర్భవించిన మానవులు వాటిని, మాటలుగా అల్లుకున్నారు. అలా ప్రపంచంలో ఎన్నో దేశాల ప్రజలు వారి కనుగుణంగా భాషను తీర్చిదిద్దుకున్నారు. అలా దేశానికి ఒక భాషగా వెలసిన భాష, ప్రాంతాలుగా విస్తరించి ప్రాంతానికి ఓ భాషగా ఏర్పడింది.

10/02/2017 - 21:08

చాలా మంది ప్రేక్షకులు కథానాయికల గ్లామర్ ప్రదర్శనను చూడడానికే థియేటర్లకు వస్తుంటారని దర్శక, నిర్మాతలు అనుకుంటుంటారు. కానీ, అది నిజం కాదని అనేక సినిమాలు రుజువు చేశాయి కూడా. అయితే హీరోయిన్ల అందాల ఆరబోత సినిమా సక్సెస్‌లో రవ్వంత భాగం ఉంటే ఉండొచ్చునేమో కానీ అదే చిత్ర విజయానికి కారణం అనుకుంటే మాత్రం పొరపాటే!

Pages