S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/02/2017 - 21:05

బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘చెన్న కేశవరెడ్డి’లో ఆయనతో తొలిసారి జోడీకట్టింది శ్రీయ. ఆ తర్వాత ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లో రెండోసారి మెరిసింది. తాజాగా ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ 101వ చిత్రం ‘పైసా వసూల్’లో నూ కనువిందు చేసింది. బాలయ్యతో మూడు సార్లు జోడీ కట్టారు కదా.. ఎలా వుంది?

10/02/2017 - 21:04

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఇటీవల ఓ మాగ్జిన్‌కి హాట్ ఫొటో షూట్‌తో దర్శనమిచ్చి అందరి మతులు పోగొట్టింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా హల్‌చల్ చేయడం వల్ల దీపిక మరింత వార్తల్లోకి వచ్చింది. ఈ మధ్య కాలంలో కథానాయికల అందాల ప్రదర్శన శృతి మించిపోతోంది. ఇలాంటి గ్లామర్ షోలను యువతరం తనివితీరా ఎంజాయ్ చేస్తున్నా, కొందరికి మాత్రం తీవ్రంగా ఒళ్లు మండిపోతోంది.

10/02/2017 - 21:02

వినోదం, సెంటిమెంటు, హుషారైన పాటల మేళవింపుతో తయారైన క్రిస్పీ వంటకంలాంటి చిత్రం అనాథగా వున్న అక్కినేనిని దొంగల ముఠా తమలో కలుపుకోవడంతో, అతడు ఆరితేరిన దొంగగా మారి అవలీలగా దొంగతనాలు చేస్తూ ఆ ముఠాలో కీలకంగా మారతాడు.

10/02/2017 - 20:57

తెలుగు చలన చిత్రాలలో ఇప్పటికే ఎన్నో వందల సినిమాలు ప్రేక్షకులు చూసారు. అన్ని చిత్రాల్లో కొన్ని చిత్రాలు మనసును ఆకట్టుకుంటాయి. హృదయాన్ని ఏ పిల్ల సమీర తీరాలకో తీసుకెళతాయి. కొన్ని చిత్రాలు సందేశాత్మకంగా ఉంటే, మరికొన్ని నిత్య నూతనంగా భావించే ప్రేమలాలిత్యంతో అద్భుతంగా ప్రేక్షకుల మనసులలో తొణికిసలాడుతాయి. ఏ సినిమా ఏ ప్రేక్షకుడికి ఎలా నచ్చుతుందో తెలియదు.

10/02/2017 - 20:56

2010లో విడుదలై బాక్సాఫీసు విజయాన్ని చవిచూడలేకపోయిన ‘ఖలేజా’ అనే చిత్రంలోని పాట ఎప్పటికీ చిరస్మరణీయమై సంగీత సాహితీప్రియులను మరిపించి మురిపించింది. సిరివెనె్నల సీతారామశాస్ర్తీ శిష్యరికంలో తర్ఫీదు పొందిన రామజోగయ్య శాస్ర్తీ కలం నుంచి జాలువారిన ఈ గీతం నాటి ‘శంకరాభరణం’ గీతాలకు ధీటుగా నిలిచి ప్రశంసార్హమైంది!

10/02/2017 - 20:53

వెనె్నలకు రచనలు
పంపాలనుకునే వారు
ఈ కింది విషయాలను గమనించగలరు

09/25/2017 - 21:59

‘‘కథానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమాల కోసం చాలా కాలం ఎదురుచూశాను. అలాం టి చిత్రాల్లో నటించాలంటే ప్రతిభకు తోడూ అదృష్టమూ కలిసిరావాలి. అలా కుదిరినప్పుడే కెరీర్‌లో అనుకున్నది సాధించడానికి వీలుంటుంది. అప్పుడే తృప్తి’’ అంటోంది అందాలతార నయనతార. దాదాపు పదేళ్లపాటు టాలీవుడ్, కోలీవుడ్ అంటూ తెగ తిరిగేసిన ఈ భామ ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేసింది.

09/25/2017 - 21:47

ఒక డాక్టరు తన కుమారుడిని డాక్టరుగా తీర్చిదిద్దాలని, ఒక ఇంజనీర్ తన కొడుకుని ఇంజనీర్‌గా తీర్చిదిద్దాలని అనుకోవటంలో తప్పులేదు. ఆశ్చర్యపోవలసిన పని కూడా లేదు. నటుడు కాంతారావు తన మూడవ కుమారుడు రాజాను చిన్నతనం నుంచి గమనిస్తూ నటనా రంగంపై ఆసక్తిగా వున్నట్లు భావించి, నటనారంగంలో తర్ఫీదు ఇవ్వటం ప్రారంభించాడు.

09/25/2017 - 21:45

1960కి ముందు విఠలాచార్య కన్నడంలో నిర్మించిన ‘మనేతుంబిదహెన్ను’ ఆధారంగా విజయవారు ‘గుండమ్మకథ’ నిర్మించారు. తెలుగు నేటివిటీ ఏ మాత్రం తగ్గకుండా శ్రద్ధ తీసుకున్నారు. కన్నడ మాతృకలో గుండమ్మకు భర్త వుంటాడు. తెలుగులో చక్రపాణిగారు వూరు పేరు లేని అటువంటి భర్త వున్నా లేకున్నా ఒకటేనని ఆ పాత్రను తొలగించి గుండమ్మ పాత్రకు జీవం పోశారు. ఆ పాత్రను సూర్యకాంతం చిరస్మరణీయంగా పోషించింది.

09/25/2017 - 21:42

స్వాతంత్య్రానికి పూర్వం దేశభక్తులు, రాజకీయ నాయకులు పడ్డ అగచాట్లను, పోలీసు అధికారుల దౌష్ట్యాన్ని నేపథ్యంగా ఎంచుకొని శోభనాచల సంస్థవారు ఎలాగైనా చిత్రం తీసి, స్వతంత్ర భారతదేశ ఆవిర్భావ సందర్భంగా విడుదల చేయాలన్న సంకల్పంతో నిర్మాత మీర్జాపురం రాజాగారికి కలిగింది.

Pages