S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/16/2017 - 19:37

ఓరచూపుతో, ఎడమచేయిని గాలిలో వూపుతూ కుడిచేయిని నడుంమీద పెట్టుకొని, మూతి ముడుచుకొని వెక్కిరిస్తూ వ్యంగ్యంగా మాట్లాడే సూర్యకాంతం ఒకసారి నాగయ్యగారితో కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఆ దృశ్యంలో నాగయ్యగారిని ఆమె తిట్టాలి. సీన్ అయిపోయిన వెంటనే నాగయ్యగారి కాళ్లమీద పడి ‘క్షమించండి నాన్నగారూ’ అంటూ కళ్లనీళ్ల పర్యంతం అయ్యారట. ‘అదేంటమ్మా తిట్టింది పాత్ర కదా’ అని అన్నారట నాగయ్యగారు.

10/16/2017 - 19:36

నిర్మాత దర్శకులు కె.వి.రెడ్డి నిర్మాణ దశలో వున్న వాహిని స్టూడియోకు ‘వేమన’ చిత్రం తీయాలని వచ్చారు. కానీ స్టూడియోకు మొట్టమొదటి సినిమా ‘బాక్సాఫీస్’ హిట్ కావాలి. అందుకోసం ఏం చెయ్యాలి? అని ఆలోచించారు. పింగళి నాగేంద్రరావును రచయితగా తీసుకున్నారు. ఆయన మంచి రచయిత. షేక్స్‌పియర్ రాసిన ‘కింగ్‌లియర్’లోని ప్రధానాంశం తీసుకొని దానికి మార్పులు చేర్పులు చేసి అద్భుతంగా రాశారాయన.

10/16/2017 - 23:24

టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది అందాల ముద్దుగుమ్మ సమంత. ప్రస్తుతం ‘రాజుగారి గది-2’ చిత్రంలో నటిస్తున్న సమంత, నాగచైతన్యతో కొంతకాలంగా జోరు ప్రేమాయణం సాగించిన విషయం తెలిసిందే. ఈనెల 6న వీరి పెళ్లి గోవాలో సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. మరోవైపు సమంత పెళ్లి తరువాత కూడా సినిమాలు కంటిన్యూ చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. ఈ కోవలో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది.

10/09/2017 - 20:50

టాలీవుడ్‌లో అనతి కాలంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన బ్యూటీ రాశీఖన్నా. తెలుగు చిత్రసీమకు దాదాపు రకుల్ ప్రీత్‌సింగ్‌కి అటు ఇటు గా పరిచయమయింది. కానీ రకుల్ మాత్రం చూస్తుండగానే స్టార్ హీరోయిన్ అయింది. అయితే రాశీఖన్నా మాత్రం ఇంకా ‘రేంజ్’లో ఆమెకంటే వెనుకంజలోనే వుంది. తను నటిస్తున్న చిత్రాల్లో మీడియం రేంజ్ కథానాయకులతో..అదీ సెకండ్ హీరోయిన్ పాత్రలకే పరిమితమవుతోంది.

10/09/2017 - 20:49

నందమూరి బాలకృష్ణ వేగాన్ని అందుకోవడం ఇప్పటి యువ హీరోలకే కష్టంగా మారింది. వంద సినిమాలు పూర్తిచేసిన బాలయ్య వేగం పెంచాడు. వరుసగా 101గా పైసావసూల్ విడుదలైంది. ప్రస్తుతం 102గా తమిళ సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తరువాత బాలయ్య ఇద్దరు ముగ్గురు దర్శకులతో కథా చర్చలు జరుపుతున్నాడట.

10/09/2017 - 20:29

తెలుగు చిత్రసీమలో సామాజిక చిత్రాలను తనదైన శైలిలో ప్రేక్షకులు మెచ్చేలా రూపొందించిన దర్శకుడిగా పి.సునీల్‌కుమార్ రెడ్డికి పేరుంది. శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆయన దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాలు ప్రేక్షకుల్ని ఆలోచింపజేశాయి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి.

10/09/2017 - 20:23

కీర్తి..కీర్తి..కీర్తి...ఇప్పుడు తెలుగు, తమిళనాట చిత్ర పరిశ్రమలో అందరి నోళ్లలో నానుతున్న పేరు. ఇటు దర్శక, నిర్మాతలు.. అటు అగ్ర కథానాయకులే కాదు, యువతరం క్రేజీ హీరోలు కూడా తమ చిత్రాల్లో కీర్తి సురేషే వుండాలంటున్నారట! చిత్రసీమలోకి అడుగుపెట్టే ప్రతి బ్యూటీ తన స్థానాన్ని టాప్ పొజిషన్‌లో చూసుకోవాలనే ఆరాటపడుతుంది. అందుకోసం ఎన్నో కలలు కూడా కంటుంది. కానీ, కొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం దక్కుతుంది.

10/09/2017 - 20:20

కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా శుభసంకల్పం. కమలహాసన్ సినీ జీవితంలో చక్కని కళాత్మక విలువలనీ నిలబెట్టినది. సినీ వెండితెరను వాహినీ సంస్థ నుండి ఎరిగిన కళాతపస్వి, కమలహాసన్, ఆమని, కె.విశ్వనాథ్, గొల్లపూడి, ప్రియారామన్ ప్రధాన పాత్రధారులు. కమలహాసన్, ఆమని నటన ప్రదర్శించిన తీరు చాలా సహజంగా ఉంటుంది. గొల్లపూడి మారుతీరావు మాటలు సున్నితమైన భావోద్వేగాన్ని గురిచేస్తాయి.

10/09/2017 - 20:18

1968లో విడుదలైన లక్ష్మీ నివాసం చిత్రంలోని ఈ గీతం ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయంది. ధనాన్ని సృష్టించిన మనిషి దానిని తన నియంత్రణలో ఉంచుకోకుండా తానే దాని ఆధీనంలోకి వెళ్లిపోవడంతో కలిగే ఇక్కట్లను రచయిత ఆరుద్ర ఈ పాట ద్వారా చెప్పిన తీరు ఆలోచనాత్మకంగా వుంది.

10/09/2017 - 19:51

సినిమాలలో ప్రవేశించిన తర్వాతనే ఎవరైనా సినిమా గురించి తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. ఇది సాధారణం. ముందే సినిమా పరిజ్ఞానం అవగాహన చేసుకొని చిత్రరంగ ప్రవేశం చేయడం అన్నది అరుదు. ఇటువంటి అరుదైన విశేషంతో సినిమా ప్రవేశం చేసినవారు ప్రసిద్ధ నిర్మాత దర్శకుడు మార్గదర్శకుడు కె.వి.రెడ్డి.

Pages