S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/18/2017 - 23:00

టాలీవుడ్‌లో క్రేజీ భామల్లో అందాల రాశి కీర్తి సురేష్ ఒకరు. ఆమె నటించిన చిత్రాలు.. చేసిన పాత్రలు వేటికవే భిన్నంగా వుండి అందర్నీ అలరించాయి. ప్రతిభ గల నటిగానే గాక, చిరునవ్వుతో యువతను తన వైపునకు దృష్టి మరల్చేలా చేసుకుంది. తెలుగు, మలయాళం, తమిళం అంటూ మూడు పడవల ప్రయాణం చేస్తున్న ఈ బ్యూటీకి మూడు చోట్లా చేసిన పాత్రలే కెరీర్‌లో ఎదిగేలా ‘కీర్తి’ని సంపాదించి పెట్టాయి.

09/18/2017 - 22:51

ధనిక మరియు పేద వర్గాలమధ్య రేగే సంఘర్షణను కథా వస్తువుగా తీసుకొని స్వతంత్రా వారు తమ తొలిచిత్రంగా ‘ద్రోహి’ని నిర్మించారు. 1948, డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదలై విజయం సాధించింది. ఆ చిత్రంలోని ముఖ్యపాత్రధారి, నిర్మాత నేటి ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుగారి తండ్రి కె.ఎస్.ప్రకాశరావు.

09/18/2017 - 20:10

పెద్దయ్యాక ఏమవుతావు అన్న టీచర్ ప్రశ్నకి పెద్ద పెయింటర్ అవుతానని చెప్పిన పాలమూరు పిల్లవాడు గోవిం దు- పి.జి. విందా పేరుతో పెద్ద సినిమాటోగ్రాఫర్ అయ్యాడు. తొలి సినిమా ‘గ్రహణం’తోనే ప్రయోగాల బాటపట్టి సక్సెస్ కొట్టాడు. అప్పటినుంచి అమీతుమీ వరకు దర్శకుడు ఇంద్రగంటి సినిమాలన్నింటికీ కెమెరా కన్ను పి.జి.విందానే! పూరీ, నీలకంఠ, వంశీలాంటి ఇతర దర్శకులతోను పనిచేసాడు.

09/18/2017 - 22:41

ఈ చిత్రంలో కనిపిస్తున్న మహా ఇల్లాలిని గుర్తించారా? తెలుగు రాష్ట్రాలలో అధికులు ఆమెగారిని గుర్తిస్తారు. మీరూ ప్రయత్నించండి. సరే కొన్ని ఆధారాలు మీ ముందు ఉంచుతాను. ఆమెపేరుమీద ఒక ఆసుపత్రి హైదరాబాద్‌లో వుంది. ఆమె ఇద్దరు కుమారులు, ముగ్గురు మనుమలు కూడా నటులే. కేవలం ఇంటి పనులతోనే ఆమె క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు.

09/18/2017 - 20:03

బాహుబలి’ తరువాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సాహో’ చిత్రం షూటింగ్ విదేశాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామ శ్రద్ధాకపూర్‌ని ఎంపిక చేశారు. ఆమె ఎంపిక అయినప్పటి నుండి శ్రద్ధాకపూర్‌పై రకరకాల రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ చిత్రంలో శ్రద్ధాకపూర్ రెండు పాత్రలు చేస్తుందంటూ ప్రచారం కూడా జరుగుతోంది.

09/18/2017 - 22:42

పాటకు ప్రత్యేక గౌరవం కల్పించి పట్ట్భాషేకం చేయటం సాహిత్యానికి, సంగీతానికి, గాత్రానికి ప్రథమ తాంబూలం ఇవ్వటం వంటి సర్వోన్నత ప్రక్రియలు చేయటానికి జయభేరి (1959) చిత్రా న్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పెండ్యాల స్వర నైపుణ్యం, ఘంటసాల గాత్ర ధర్మంలోని మర్మాలు జానుతెనుగు పదాల మల్లాది, నటీనటుల అభినయం అన్నీ కలిసి జయభేరి మ్రోగించాయి. పెండ్యాల స్వరకల్పన కొన్నిచోట్ల మహోత్కృష్టంగా ఉంటుంది.

09/18/2017 - 22:43

ఈరోజుల్లో ఏ సినిమాకూ సకుటుంబ సపరివారంగా వెళ్ళే అవకాశమే లేనంత గొప్ప స్థాయిలో సినిమాలు ఉన్న విషయం తెలియంది కాదు. 1950-70 నాటి స్వర్ణయుగపు సినిమాల కోవలో జగపతివారి ‘అన్నపూర్ణ’ సినిమా నిలుస్తుంది. కధ సినిమా ఆసాంతం ఉంటుంది. కథనం నడిపే తీరు ప్రశంసనీయం. గుమ్మడి, జమున, జగ్గయ్య ప్రధాన పాత్రధారులు.

09/12/2017 - 00:27

హృతిక్ రోషన్, ఆదిత్య పాంచోలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ -ఇక కెరీర్‌కు ముగింపు పలకడం ఒక్కటే మార్గమన్నది సినీ వర్గాల మాట. దానికి కంగనా సమాధానం ఇదీ..

09/12/2017 - 00:25

ఒకప్పుడు మగవాళ్లే ఆడపాత్రలు వేసి మెప్పించారు. అతివ ఇంత అందంగా, ఇంత వయ్యారంగా, ఇంత సొగసుగా ఉంటుందా? అని ఆశ్చర్యం కలిగేంతగా కళాకృష్ణ లాంటి వాళ్లు పాత్రల్ని పోషించి మెప్పించారు. కానీ, మహిళలు మగ పాత్రలు వేసి మెప్పించిన చరిత్రా తెలుగు తెరకు ఉంది. కళాభినేత్రి వాణిశ్రీ సతీ సక్కుబాయి చిత్రంలో శ్రీకృష్ణుడిగా మెప్పించిన సంగతి చిత్రం చూసిన వాళ్లకు ఎరుకే.

09/12/2017 - 00:21

తెలుగు సినిమాల్లో అమ్మపాట అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ఆచార్య ఆత్రేయ. ఆత్రేయకు తన తల్లి సీతమ్మ అంటే అమితమైన ఇష్టం. ఆత్రేయకు పదేళ్ళ వయసులోనే సీతమ్మ చనిపోయింది. ఆమె చావుకు అనంతశయనుడనే పేరుగల దాయాది (మునసబు) కారకుడనీ, అతను జంగమయ్య అనే వైద్యుని ద్వారా విష ప్రయోగం చేసి ఆమెను చంపించాడని ఆత్రేయ కుటుంబీకులు అభిప్రాయపడ్డారు.

Pages