S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/08/2016 - 21:32

భగవంతుని సృష్టిలో మనకు అన్నీ అద్భుత రహస్యాలే. ఆదికాలం నుండి మానవుడు చేసే ప్రతి చర్య భగవత్ సంకల్పబలమే. తరిగే కాలాన్ని, పెరిగే మనిషి ఆయుష్షును ఎవరూ ఆపలేరు. మన జననం మనకు తెలియదు.. మన మరణం మరెవరికీ తెలియని మర్మం. అదే దేవరహస్యం. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. పంచభూతాలు మనల్ని నడిపించే ప్రత్యక్ష దైవాలు. వాటిని సక్రమంగా వినియోగించుకుంటే లోకకళ్యాణం, లేదంటే ప్రళయం.

12/08/2016 - 21:31

బహు కష్టములం బొందక
మహిలో సమకూడబోదు మానవ జన్మం
బహహ! ఈ జన్మంబున
నిహపరముల గొనెడు జాడ లెఱుగు కుమారీ!

12/08/2016 - 21:30

అనాకారుల్లో ఉన్నంత ఆకర్షణ కూడా తనలో లేదా? తనలో ఏ ఆకర్షణా కనిపించకపోవడంవల్లనేనా- దీపం వెలుతుర్లో తనకు నిద్రపట్టదని చెప్పినవాడు కూడా అంత హాయిగా తన ఉనికినే పరిగణనలోకి తీసుకోని వాడిలా అంత హాయిగా నిద్రపోతున్నాడతడు?
పరస్తుతి, ఆత్మనిందలతో మనసులో ఎంతసేపు ఎన్ని విధాలుగా విత్కరించుకున్నా ఆలోచనలు ఒక కొలిక్కి రాలేదు సామ్రాజ్ఞికి.

12/08/2016 - 21:21

‘ప్రస్తుతం నిర్మిస్తున్న చిత్రాలలో భారతీయత, మన సంస్కృతి ఎక్కడా కనబడడంలేదు. దర్శక నిర్మాతలందరూ ఓ గిరి గీసుకొని కూర్చున్నారు. మన సంస్కృతిమీద ఆధారపడి బతుకుతున్నవారు ఎందరో వున్నారు. అలాగే సినిమా పరిశ్రమపై ఆధారపడినవారు ఎంతోమంది వున్నారు. సినిమాల ప్రభావం పాత్రలపై పడుతున్నాయి.

12/08/2016 - 21:14

అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి చిత్రాలు ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్లీ వీరిద్దరి కలయికలో రూపొందుతున్న మరో భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. సాయికృప ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లి. పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

12/08/2016 - 21:12

వలసల నేపథ్యంలో పి.సునీల్‌కుమార్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘గల్ఫ్’. శ్రావ్య ఫిలింస్ పతాకంపై యెక్కలి రవీంద్రబాబు, ఎం.రమణీకుమారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చేతన్ మద్దినేని, డింపుల్ ఇందులో హీరో హీరోయిన్లు. ఇటీవలే చిత్రీకరణ మొత్తం పూర్తయిందని, ప్రస్తుతం ఎడిటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా విశేషాలను దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి వివరించారు.

12/08/2016 - 21:10

‘రంగం’ వంటి సూపర్‌హిట్ మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కవలై వేండం’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఎంతవరకు ఈ ప్రేమ’ అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. డి.కె. దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు.

12/08/2016 - 21:08

అశోక్ చంద్ర, రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య ప్రధాన తారాగణంగా శ్రీ శ్రీనివాసా ఫిలింస్ పతాకంపై టి.కరణ్‌రాజ్ దర్శకత్వంలో ఎస్.పి.నాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘ఇదో ప్రేమలోకం’. ఈ చిత్రానికి సంబంధించిన రీ రికార్డింగ్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు కరణ్‌రాజ్ మాట్లాడుతూ- ఓ అందమైన ప్రేమకథగా రూపొందించిన ఈ చిత్రంలో ఓ మేఘమాల కథనం వుంటుందని అన్నారు.

12/08/2016 - 21:05

గత కొద్దికాలంగా హీరోయిన్ ప్రధాన సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తూ వస్తోన్న త్రిష, హీరో ప్రధాన సినిమాల్లోనూ తనకంటూ ఒక బలమైన పాత్ర ఉండేలా చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ‘్ధర్మయోగి’ అనే సినిమాలో ఎవ్వరి ఊహకూ అందకుండా ఓ నెగెటివ్ రోల్ చేసిన త్రిప ఇప్పుడు సౌతిండియన్ సినిమాలో మళ్లీ టాప్ హీరోయిన్ రేసులోకి వచ్చేశారు.

12/08/2016 - 21:04

‘సరైనోడు’తో బంపర్ హిట్ కొట్టి తన స్థాయిని మరింత పెంచుకున్న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్ ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా, తాజాగా రెండో హీరోయిన్ కోసం ప్రగ్యా జైస్వాల్‌ను ఎంపిక చేసారు.

Pages