S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/08/2016 - 21:01

నీలిమ ప్రొడక్షన్స్ పతకంపై ఆనంద్ కృష్ణ, స్వరూప హీరో హీరోయిన్లుగా బేబీ హర్షిత ప్రధాన పాత్రలో ఆనంద్ కృష్ణ నిర్మాతగా సూర్యకిరణ్ ఇలాది దర్శకత్వంలో భక్తిరస చిత్రం ‘నీలిమలై’. వనపర్తి పరిసర ప్రాంతాలలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.

12/08/2016 - 08:46

ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, పోషకాలు అతి చౌకగా లభించే ఆకు కూరలు తినటమే మేలు. కాని పచ్చటి ఈ ఆకుకూరలను మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. వీటిని ప్రతిరోజూ ఆహారంగా తీసుకుంటే అధిక బరువు పెర గకుండా శరీరాకృతి నాజుకుగా కూడా ఉంటుంది. సాత్వికాహారమైన ఆకు కూరల్లో పోషకాలు పోకుండా ఉండాలంటే వాటిని సూర్యరశ్మి తగలని ప్రదేశంలో ఉంచాలి. సూర్యరశ్మి తగిలితే ఆకుకూరల్లో వుండే కెరోటిన్ అనే పోషక పదార్థాలు నశిస్తాయి.

12/08/2016 - 08:45

పొన్నగంటికూర రక్తాన్ని శుభ్రపరచడమే కాక శరీరానికి చలువనిస్తుంది. గుండెకి మంచిది. బి, సి విటమిన్‌లు ఎక్కువగా వుంటాయి. జీర్ణశక్తిని పెంచుతుంది. మూత్ర వ్యాధులవను నివారిస్తుంది. పొన్నగంటి ప్రొటీన్ల పుట్ట అని సామెత. విటమిన్ ఎ, బి6, సి, ఫాలేట్, రిబొఫ్లావిన్, పొటాసిం, ఇనుము, మెగ్నీషియం దీనిలో సమృద్ధిగావుంటాయి. గోధుమపిండి, బియ్యం, ఓట్స్‌లో కంటే 30 శాతం అధికంగా ప్రొటీన్లు దీనిలో వున్నాయి.

12/08/2016 - 08:43

మోదీగారు రద్దుచేసిన ఐదువందల నోట్లుకి బదులుగా మింట్‌లో ప్రింటింగ్ ప్రెస్సుల్లో- ఇరవై నాలుగు గంటలూ నాన్‌స్టాప్‌గా ప్రింటు చేస్తున్నారు గానీ వాటికి అవసరమయిన కాగితం- హోషింగాబాద్ మిల్లునుంచి కోటి అరవై లక్షల టన్నులు వస్తూ వున్నా చాలక బ్రిటన్ నుంచి హుటాహుటీ తెప్పిస్తున్నారు. ఒక రకంగా అవి ‘విదేశీ’ కాగితం తయారీవే కాగా- ఈ ‘నోట్’లలో ‘సెక్యూరిటీ ధ్రెడ్’ నోటును ఎత్తిచూడగా కనబడే లోహ రిబ్బన్ కూడా మనది కాదు.

12/08/2016 - 08:41

శరెండున్నర రూపాయలకే శానిటరీ
ప్యాడ్స్, డిస్పోజ్ కూజా
శసింపుల్ .. సులభం .. సురక్షితం
శఅమ్మాయిల ఆరోగ్యంపై దంపతుల
ఆరాటం

12/08/2016 - 08:39

డెన్మార్క్ రాజధాని కొపెక్ హాగన్‌లో ముష్టెత్తుకుంటున్న ఒక స్ర్తిని నలభై రోజులు జైల్లోపెట్టి అటు తరువాత దేశ బహిష్కారాన్ని చేస్తూ నోల్వేకియాకి పంపించి వేయాలని డెన్మార్క్ రాజధాని కొపెక్ హాగన్ కోర్టు తీర్పు చెప్పింది. డెన్మార్క్‌లో యాచక వృత్తిని బహిష్కరించారు. ఐరోపా యూనియన్‌లో సోల్వేకియాకి సభ్యత్వం వుంది.

12/08/2016 - 08:28

భగవంతుడి నిర్ణయాలు, మనుషుల కర్మ ఫలాలు కలిసి మానవ జీవితం నిర్మించబడి లోకంలో మనుగడ సాగిస్తుంది. సృష్టించిన కర్త, కర్మలకు బాధ్యతను ఆయా జీవులకే వదిలివేస్తాడు. మంచి చెడ్డలు, పాప పుణ్యాలు ‘చేసుకున్నవారికి చేసుకున్నంత’ అనే ప్రాప్తానికి కట్టుబడి ఉంటుంటాయి. కష్టసుఖాలు, కలిమిలేములు భూమిపై జన్మించినవారికి దాదాపు అన్ని వర్గాలవారికి వర్తిస్తాయి. ఏదీ మన చేతిలో ఉండదన్న విషయం విదితమే.

12/08/2016 - 08:26

ఈ రీతిగా పెద్దకాలం రాజ్యం ఏలి, సుతుడి భుజాన రాజ్య భారం మోపి, కాశీకి చని, అయోధ్య, అవంతి, కాంచి, మధుర, ద్వారవతి, ఉజ్జయినీ తీర్థాల సంసేవనంవల్ల విశే్వశ్వరుడి అనుగ్రహంవల్ల మోక్షం పొందుతావు అని పలికి హరి సేవకులు ఆ శివశర్మని దివ్య విమానం నుంచి దింపి, నారాయణుడి ముందట వుంచారు.

12/08/2016 - 08:25

అతడితో కలిసి ఆ రాత్రి ఆ గదిలో ఉండవలసి రావడం ఆమెకిష్టం లేకపోయినా అతడి మాటలు హేతుబద్ధంగా ఉండడంతో ఏమీ మాట్లాడలేకపోయింది సామ్రాజ్ఞి.
‘తన భర్త ఎవరో పరాయి స్ర్తితో పగటి సమయాన పదిమందీ తిరిగే దేవాలయం వంటి చోట మాట్లాడుతూ కనిపించారని ఎవరో చెప్పినందుకే తను అతణ్ణి నిలదీసిందే!
ఇలా రాత్రి సమయాన ఒక అపరిచిత వ్యక్తితో తను హోటల్ గదిలో ఉందని ఎవరికైనా తెలిస్తే తనేం చెప్పినా నమ్ముతారా?!’’

12/08/2016 - 08:23

కం మఱవవలె గీడు నెన్నడు
మఱువంగరాదు మేలు మర్యాదలలో
దిరుగవలె సర్వజనముల
దరి ప్రేమ మెలంగవలయు దరుణి కుమారీ!
భావము: ఓ కుమారీ! ఒకరు చేసిన అపకారమును మరచిపోవలెను. ఎప్పుడైనను ఒకరు చేసి ఉపకారమును మరచిపోకూడదు. లోకమునందుండెడి నడవడికలయందు వాడుక పడవలెను. సమస్త జనులయందు ప్రీతితో నడచుకొనవలెను. లోక మర్యాదలను విడిచిపెట్టకుండా జనులందరిపట్లా ప్రేమతో వుండాలని కవి భావము.

Pages