S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/08/2016 - 23:37

విజయనగరం, డిసెంబర్ 8: సంగీతం విశ్వజనీనం. సంగీతానికి భాషా, బేధం లేదు. అందువల్లనే పాశ్చాత్యులు కూడా భారతీయ నృత్యాలపట్ల ఆకర్షితులవుతున్నారు. పూర్వం సంగీతంతో జబ్బులు నయం చేసేవారని నానుడి కూడా ఉంది. మనస్సుకు ఆహ్లాదం కలిగించే సంగీతం వింటే ఎవరికైనా సాంత్వన చేకూరుతుంది. అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఎంతో ఇష్టపడేది సంగీతం తరువాత నాట్యం. నాట్యకళ వైద్యపరంగా ఎంతో విశిష్టమైనది.

12/08/2016 - 23:37

విజయనగరం (్ఫర్టు), డిసెంబర్ 8: సరైన ప్రణాళిక లేకపోవడం.. సమయపాలన పాటించకపోవడం.. ప్రైవేటువాహనాల జోరు పెరగడం.. గ్రామీణ రూట్ల పట్ల నిర్లక్ష్యం వల్ల ఆర్టీసీ విజయనగరం నార్త్‌ఈస్ట్‌కోస్టల్ రీజియన్ తేరుకోలేని నష్టాలతో నడుస్తోంది. ప్రతీయేటా నష్టాలు పెరుగుతుండటంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కిలోమీటరుకు అయిదు రూపాయల మేరకు నష్టం రావడంతో ఏమిచేయాలో తెలియక సతమతం అవుతున్నారు.

12/08/2016 - 23:35

సూర్యాపేట, డిసెంబర్ 8: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బంది పనితీరును మార్చి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ వాకాటి కరుణ వెల్లడించారు. గురువారం జిల్లావ్యాప్తంగా రాష్టస్థ్రాయి వైద్యాధికారులు 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీచేశారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వం నిర్దేశించిన వైద్య సేవలను అందిస్తున్న తీరుపై పరిశీలన చేపట్టారు.

12/08/2016 - 23:34

సూర్యాపేట, డిసెంబర్ 8: మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన రక్షణ చర్యలను చేపట్టిందని రాష్ట్ర విద్యుత్, దళిత అభివృద్ది శాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేసిన స్నేహిత పోలీస్ బృందాలను రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాకేంద్రంలో గురువారం ప్రారంభించారు.

12/08/2016 - 23:34

నల్లగొండ, డిసెంబర్ 8: నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన జనమైత్రి కార్యక్రమంలో భాగంగా ఫ్లోరోసిస్ బాధితులకు కార్పోరేట్ వైద్య చికిత్సలు అందించి ఫ్రెండ్లీ పోలీస్ విధానంలో ముందడుగు వేశారు. ఇటీవల జిల్లా ఎస్పీ ఎన్.ప్రకాశ్‌రెడ్డి సారధ్యంలో మర్రిగూడలో ఫ్లోరోసిస్ బాధితులకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.

12/08/2016 - 23:33

నల్లగొండ టౌన్, డిసెంబర్ 8: పశువులను వాహనంలో తరలించేటప్పుడు నియమ నిబంధనలు, జాగ్రత్తలు పాటించాలని లేనిచో కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. గురువారం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన జిల్లాస్ధాయి పశువుల కౄరత్వ నిరోధకస్ధాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

12/08/2016 - 23:32

చౌటుప్పల్, డిసెంబర్ 8: టెక్స్‌టైల్ పార్క్ రూపురేఖలు మార్చి అభివృద్ధి పథంలోకి తీసుకువస్తానని చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు తెలిపారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులోని టెక్స్‌టైల్ పార్క్‌ను గురువారం సాయంత్రం అకస్మికంగా సందర్శించారు. పార్క్‌లోని యూనిట్లను పరిశీలించారు. 119 యూనిట్లకు కేవలం ఐదు యూనిట్లు నడవడం బాధకరమన్నారు.

12/08/2016 - 23:32

కట్టంగూర్, డిసెంబర్ 8: కట్టంగూర్ సింగిల్‌విండో ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 13డైరెక్టర్ స్థానాలకు గాను 8డైరెక్టర్ స్థానాల్లో గెలుపొంది సింగిల్‌విండో చైర్మన్‌ను అధిష్టించనుంది. ప్రతిపక్ష కాంగ్రెస్‌పార్టీ గట్టిపోటీ ఇచ్చినప్పటికి 5స్థానాలకే గెలుపు పరిమితమయ్యింది.

12/08/2016 - 22:50

మార్కెట్‌ను రకరకాల వేరబుల్ కెమెరాలు ముంచెత్తుతున్నాయి. అలా అని కొత్త వాటికి చోటు లేదని కాదు. తాజాగా వచ్చిన పోగో కామ్ కెమెరాను చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవలసిందే. ఇది ప్రపంచంలోనే అతి చిన్నదైన అటాచబుల్ కెమెరా. కళ్లజోడు ఫ్రేమ్‌కు అటాచ్ చేసుకునేందుకు వీలుగా రూపొందించిన ఈ కెమెరాతో టకటకా 100 ఫొటోలు ఏకధాటిన తీసేయొచ్చు. అలాగే రెండు నిమిషాలసేపు వీడియో తీయొచ్చు కూడా.

12/08/2016 - 22:49

‘మీ ఇంటికొచ్చా...మీ నట్టింటికొచ్చా’ అంటూ ఓ హీరో పలికిన డైలాగ్ ఆ మధ్య బాగా పాపులర్ అయింది. అవే మాటలు ఓ రోబో పలికితే ఎలా ఉంటుంది!
ఆశ్చర్యంగా ఉంటుంది కదూ! లండన్‌కు చెందిన సైమన్ అనే మహిళ కూడా ఇలాగే బోలెడంత ఆశ్చర్యపోయింది. దానికి కారణం.. ఓ రోబో స్వయంగా వచ్చి, ఆమె ఇంటి తలుపు తట్టి ఆమె ఆర్డర్ ఇచ్చిన ఫుడ్‌ను సర్వ్ చేసి, బై చెప్పి వెళ్లిపోవడం!

Pages