S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/08/2016 - 22:46

స్టార్‌షిప్ టెక్నాలజీస్ తయారు చేసిన రోబో కేవలం ఆహారానే్న కాకుండా, ప్యాకేజ్డ్ వస్తువులను వేటినైనా సరఫరా చేస్తుంది. అలాగే కిరాణా సరుకుల్నీ ఇంటికొచ్చి అందిస్తుంది. ఇది బ్యాటరీతో నడుస్తుంది. దీని వేగం గంటకు పదహారు కిలోమీటర్లు. ఇవి తమ కేంద్ర స్థానానికి మూడు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే వస్తువుల్ని డెలివరీ చేస్తాయి. ఈ రోబోలు కేవలం ఫుట్‌పాత్‌పై మాత్రమే వెడతాయి.

12/08/2016 - 22:40

చిన్న వయసులోనే సేవాభావాన్ని అలవరచుకోవడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు సమాజసేవకు పాటుపడుతున్న యాలాల ప్రవీణ్‌కుమార్ ఇందుకు ఉదాహరణ. సెంట్రల్ వర్శిటీలో ఫిలాసఫీలో పీజీ చేస్తున్న ప్రవీణ్‌ను ఇటీవల ఇందిరాగాంధీ ఎన్‌ఎస్‌ఎస్ (నేషనల్ సర్వీస్ స్కీమ్) అవార్డు వరించింది. వారం రోజుల కిందట ఢిల్లీలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా అతను అవార్డు అందుకున్నాడు.

12/08/2016 - 22:35

ఏడేళ్ల కిందట వచ్చిన ‘3 ఇడియట్స్’ చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంప్రదాయ విద్యావ్యవస్థలోని లోపాలను సున్నితంగా ఎత్తిచూపుతూ, పాఠ్యాంశాల బోధనలో ఎలాంటి మార్పులు చేయొచ్చో సాధికారికంగా చూపిస్తూ, వీలైనప్పుడల్లా సెటైర్లు పేలుస్తూ సాగిన ఈ సినిమా కుర్రకారును ఎంతో ఆకట్టుకుంది. అందులో హీరో అమీర్ ఖాన్ పోషించిన ‘్ఫన్‌షుక్ వాంగ్డూ’ పాత్ర అయితే మరీను!

12/08/2016 - 22:29

చెవిలో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటూ నిద్రలోకి జారుకోవడం చాలామందికి అలవాటు. అయితే వారు నిద్రలోకి వెళ్లిపోయినా, మ్యూజిక్ మాత్రం ఆగదు కదా? అయితే ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరికింది. ఇప్పుడు మార్కెట్లోకి వైబ్రేటింగ్ ఇయర్‌ఫోన్స్ వచ్చాయి. దీనికో టైమర్ మోడ్ ఉంటుంది. టైమర్‌ను సెట్ చేసుకుంటే, అప్పటివరకూ పనిచేసి, ఆటోమెటిక్‌గా ఆఫ్ అయిపోతుంది. ఇందులో అలారమ్ మోడ్ కూడా ఉంటుంది.

12/08/2016 - 22:26

ఫొటోలో కనిపిస్తున్న వస్తువేంటో అంతుబట్టడం లేదా? అరచేతికి అరంగుళం ఎత్తున ఎగురుతున్న ఈ వస్తువు ఓ బుల్లి డ్రోన్! మరో విశేషమేంటంటే... అది సెల్ఫీలు తీస్తుంది. కేవలం సెల్ఫీలు తీసేందుకే రూపొందించిన ఈ మైక్రో డ్రోన్ పేరు-ఎయిర్ సెల్ఫీ! పేరుకు తగ్గట్టే ఇది గాలిలో ఎగురుతూ సెల్ఫీలు తీస్తుంది.

12/08/2016 - 22:24

ఇంటికి రాగానే మనం పెంచుకునే పిల్లితోనో,కుక్కతోనో కాసేపు ఆడుకుంటే రిలాక్సింగ్‌గా ఉంటుంది. పెట్ డాగ్స్‌కి, పెట్ కాట్స్‌కి ఇప్పుడెంతో క్రేజ్. వాటికోసం ఇంట్లోనే బెడ్స్ ఏర్పాటు చేయడం చూస్తూనే ఉంటాం. అలాంటిదే కేట్ షార్క్ బెడ్. సొరచేప ఆకారంలో, మందమైన గుడ్డతో చేసిన ఈ బెడ్, ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది ఓ చిన్నపాటి గుహలా ఉంటుంది. పిల్లి దీంట్లోకి వెళ్లి హాయిగా కునుకు తీయొచ్చు.

12/08/2016 - 22:18

సెక్స్ వర్కర్లను చూస్తే ఈసడించుకుంటాం. అలాంటిది వారి పిల్లలకు ఈ సమాజంలో ఆదరణ లభిస్తుందా? పొట్టకూటి కోసం తల్లులు చేస్తున్న ఈ వేశ్యావృత్తి వారికి శాపంగా మారాల్సిందేనా? తల్లి బాటలోనే పిల్లలు కూడా వెళ్లాల్సిందేనా? కనీసం ఈ జనరేషన్ పిల్లలనైనా విద్యాదిశగా అడుగులు వేయిస్తే.. భావి భారత పౌరులుగా ఎదగటానికి అవకాశాలు కల్పించినట్లయితే వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది కదా!

12/08/2016 - 22:09

అనార్కలీ అందం ఎప్పటికీ చెదరనిదే.కొత్త హంగులతో మార్కెట్లోకి వస్తుంటుంది. వైవిధ్యమైన వర్ణాలతో, ఎంబ్రాయిడరీ హంగులతో అద్భుతంగా మలచిన దుస్తుల్లో పండుగల కోసం వచ్చేసింది. టాలీవుడ్ కథానాయికి రకుల్ ప్రీత్‌సింగ్ వయ్యారు ఒలికిస్తూ ధరించిన ఈ అనార్కలీ సల్వార్ కమీజ్ డ్రెస్స్ యువతుల మనస్సు దోచేస్తుంది. ఆధునికతను, సంప్రదాయాన్నీ మేళవించే అనార్కలీ సల్వార్లు కనువిందు చేస్తున్నాయి.

12/08/2016 - 22:06

టాటూ కల్చర్ ఇప్పుడు అన్ని దేశాలనూ చుట్టివేసింది. యూత్‌లో క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది. సమ్‌ధింగ్ డిఫరెంట్‌గానే ఉంటారు. నా రూటే సపరేట్ అనే కుర్రాళ్లు మాత్రం మనసుకు బాగా నచ్చిన లొకేషన్‌ను ఒంటిపై టాటూగా పొడిపించుకునేంతవరకూ నిద్రపోరు. ఈ ట్రెండే ట్రావెల్ టాటూస్! కొంతమంది అయితే విమానాన్ని బాడీమీద టాటూగా వేసుకుంటారు. ఇంకొందరైతే ఎవరికీ అర్థంకాని నెంబర్లను బొమ్మలాగా వేయించుకుంటారు. ఇష్టమైన పేర్లు..

12/08/2016 - 21:36

సర్వజ్ఞుడు అయిన మా తండ్రి ఆ జగన్మాతకి ఆనతిచ్చిన ప్రకారం నీకు చెపుతాను, ఏకాగ్రమతివై ఆకర్ణించు.
వారణస్వాది నామ నిర్వచనము
బ్రహ్మదేవుడి ఆయుర్దాయవసాన కాలంలో సమస్త లోకాలను మ్రింగి ‘మాయ’ వికల్పాలు లేనిదై తన్ను ఆశ్రయించింది. అంత పరమాత్మ అలలు లేని సముద్రమై అన్ని హద్దులు కలదై ప్రాణుల కర్మలు పండే కాలం ప్రాప్తించేదాకా మిన్నక వుంది.

Pages